E-Paper
Advertisement

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి
Advertisement

Road Accident in AP Three youths died:  తిరుపతి జిల్లాలో హోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకాల మండలం పత్తిపాటివారిపల్లెలో లారీ, భైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా..ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు జయచంద్ర(34), నారాయణ(35), నాగ మల్లయ్య(14)గా గుర్తించారు.

చిత్తూరు-కర్నూల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మృతదేహాలు లారీ కింద పడి నుజ్జునుజ్జుయ్యాయి. ఐరాల మండలంలోని వేదగిరివారిపల్లి పంచాయతీ నుంచి నలుగురు యువకులు బైక్‌పై దామలచెరువుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

బైక్‌ను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై చీకటి ఉండడంతో ఏం జరిగిందో స్థానికులు అర్థం కాలేదు. అయితే యువకులతోపాటు బైక్‌ను లారీ రోడ్డుపై ఈడ్చుకుంటూ సుమారు 150 మీటర్ల దూరం వరకు వెళ్లింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్ అతివేగంతోపాటు బైక్‌పై పరిమితికి మించి ప్రయాణించడంతోనే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మనోజ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే. ఈ ఘటనలో మృతి చెందిన జయచంద్రకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే నారాయణ భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉండన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×