E-Paper
Advertisement

Hyderabad Crime: బోరబండలో ఘోరం.. మాట్లాడటం లేదన్న కోపంతో యువతి దారుణ హత్య!

Hyderabad Crime: బోరబండలో ఘోరం.. మాట్లాడటం లేదన్న కోపంతో యువతి దారుణ హత్య!
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. తనతో సరిగా మాట్లాడటం లేదని ఓ యువతిని.. యువకుడు చంపేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధితురాలు గతంలో బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ పబ్‌లో పని చేసేది. ఆ సమయంలోనే నిందితుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వీరి మధ్య స్నేహానికి దారితీసింది. అయితే, కొంతకాలంగా ఆమె తనతో సరిగ్గా మాట్లాడటం లేదని, తనను దూరం పెడుతోందని నిందితుడు ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు.

Advertisement

వృత్తి మారడమే వివాదానికి కారణమా?
అయితే బాధితురాలు ఇటీవల పబ్‌లో పని మానేసి, వేరొక బార్‌లో కొత్తగా చేరినట్లు సమాచారం. ఈ మార్పు జరిగినప్పటి నుండి ఆమె నిందితుడితో మాట్లాడటం తగ్గించింది. తన ఫోన్ కాల్స్ ఎత్తకపోవడం, కలవడానికి నిరాకరించడంతో ఆమెపై అనుమానం పెంచుకున్న నిందితుడు, ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే “చివరిసారిగా మాట్లాడుకుందాం రా” అని నమ్మించి ఆమెను పిలిపించి, అత్యంత కిరాతకంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు.

పోలీసుల రంగప్రవేశం
ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితుడిని గాలింపు చర్యల అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. పాత గొడవలే హత్యకు కారణమా లేక మరేదైనా బలమైన కోణం ఉందా అనే దిశగా విచారణ సాగుతోంది.

Advertisement

Also Read: భారీ కుంభకోణం.. భూభారతి చలాన్ల స్కామ్‌లో రైతులకు నోటీసులు.. ప్రభుత్వం సీరియస్

కామన్ పరిచయం.. చివరికి యువతి మృతి
అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న నేరాలు ఈ సంఘటన నగరంలో ఒంటరిగా ఉంటూ పని చేసుకునే మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. పరిచయస్తులే ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతులు అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద ప్రవర్తన ఉన్న స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×