E-Paper
Advertisement

Varanasi: మహేష్ ఫ్యాన్స్ కి షాక్.. హీరోకు మించి మరో పాత్ర!

Varanasi: మహేష్ ఫ్యాన్స్ కి షాక్.. హీరోకు మించి మరో పాత్ర!
Advertisement

Varanasi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా పేరు దక్కించుకోవడమే కాకుండా.. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి ప్రపంచస్థాయి గుర్తింపును అందించిన దర్శకుడిగా రాజమౌళి (Rajamouli )నిలిచారు. అలాంటి ఈ దిగ్గజ దర్శకుడు మహేష్ బాబు (Mahesh Babu) తో ‘వారణాసి’ సినిమా చేస్తున్నారు. సుమారుగా 13 కోట్ల భారీ వ్యయంతో హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (ప్రియాంక చోప్రా) హీరోయిన్ గా నటిస్తోంది . అలాగే ప్రముఖ మాలీవుడ్ నటుడు, దర్శకుడిగా పేరు దక్కించుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కుంభ అనే పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇందులో మహేష్ బాబు రుద్ర అనే పాత్రతోపాటు మరో నాలుగు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

మహేష్ పాత్రకు ధీటుగా మరో పాత్ర..

అయితే ఇక్కడ మహేష్ అభిమానులకు రాజమౌళి భారీ షాక్ ఇచ్చారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ధీటుగా ఉండే మరో పవర్ఫుల్ నెగిటివ్ పాత్రను తీసుకురాబోతున్నారట. ఈ కీలకమైన పాత్ర కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోని రాజమౌళి రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. మహేష్ పాత్రకు ఇచ్చే ఎలివేషన్లకు ఏమాత్రం తగ్గకుండా ఈ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా ఉండబోతుందని, ముఖ్యంగా కథలో ఈ పాత్ర ఇచ్చే షాక్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది అని అటు ఫిలిం వర్గాలలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అప్పుడే అసలైన మజా..

Advertisement

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. హీరో, విలన్ పాత్రలను బ్యాలెన్స్ చేస్తేనే అసలైన కథ, ఆ పోటీ ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుందని రాజమౌళి భావించారని, అందులో భాగంగానే ఇప్పుడు హీరోకి దీటుగా ఉండే ఒక పవర్ఫుల్ పాత్రను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.. ఇక ఈ విషయం మహేష్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించినా.. ప్రేక్షకుడికి అసలైన సినిమా రాజమౌళి చూపించబోతున్నారని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీర్చిదిద్దబోతున్నట్లు సమాచారం. శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కే.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ALSO READ:Sreeleela: కొత్త ఏడాదే నిరాశ.. అమ్మడి ఆశలన్నీ అటువైపే!

వారణాసి సినిమా విశేషాలు..

Advertisement

ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందించారు.. దేవా కట్ట ఈ చిత్రానికి మాటలు సమకూరుస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో దేశం మొత్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా తన మార్కు మేకింగ్ తో ఇండియన్ సినిమాను మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×