E-Paper
Advertisement

అఘాయిత్యం చేశాడని పార్ట్స్ కట్ చేసి కాకుల కేసే అమ్మాయి… బ్రూటల్ రివేంజ్ డ్రామా

అఘాయిత్యం చేశాడని పార్ట్స్ కట్ చేసి కాకుల కేసే అమ్మాయి… బ్రూటల్ రివేంజ్ డ్రామా
Advertisement

Psychological Revenge Thriller : అమ్మాయిలు అఘాయిత్యానికి గురైతే చెప్పులు అరిగేలా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగడం లేదా ఏదైనా చేసుకుని చావడం వంటి స్టోరీ లైన్ తో వచ్చిన సినిమాలను చాలానే చూశాము. కానీ అదే అమ్మాయి తనకు జరిగిన అన్యాయానికి రగిలిపోయి, అమ్మోరు తల్లిలా మారితే ఎంత బ్రూటల్ గా ఉంటుందో తెలిపే సినిమాలు చాలా అరుదు. అలా ప్రతీకారం ఎంత భయంకరంగా, ఎంత ప్రణాళికాబద్ధంగా ఉండవచ్చో చూపించే సైకలాజికల్ థ్రిల్లర్ ‘రిటర్న్ టు సెండర్’ (Return to Sender).

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

2015లో విడుదలైన ఈ అమెరికన్ సినిమా ఒక సాధారణ మహిళ జీవితం ఒక్క రాత్రిలో ఎలా నాశనమవుతుందో, ఆ గాయం నుంచి ఎలా బయట పడి అత్యంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకుంటుందో చూపించే హార్ట్-పౌండింగ్ సైకలాజికల్ రివెంజ్ థ్రిల్లర్. ఫౌద్ మైకతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోసమండ్ పైక్ (Gone Girl ఫేమ్) ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆమె తన కెరీర్‌లోనే అత్యంత భయంకరమైన, లేయర్డ్ పాత్రల్లో ఒకటైన మిరాండా వెల్స్‌గా అద్భుతంగా నటించారు. షిలో ఫెర్నాండెజ్ విలన్ పాత్రలో బాగా సరిపోయాడు. నిక్ నోల్టే కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

చిన్న పట్టణంలో సర్జికల్ నర్స్‌ గా పని చేస్తుంది మిరాండా వెల్స్ (రోసమండ్ పైక్). చాలా క్రమశిక్షణ, శుభ్రతతో జీవించే అమ్మాయి తను. ఆమె భవిష్యత్తు పట్ల స్పష్టమైన ప్రణాళికలు ఉంటాయి. ఒకరోజు స్నేహితురాలు ఏర్పాటు చేసిన బ్లైండ్ డేట్‌ కి ఆమె ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి విలియం ఫిన్ (షిలో ఫెర్నాండెజ్). అతను సైకోపాత్ స్వభావం గల నేరస్థుడు. ఆ రాత్రి మిరాండా జీవితం పూర్తిగా నాశనమవుతుంది. అతను ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. ఆ దారుణ ఘటన తర్వాత ఆమె శారీరకంగా, మానసికంగా చెదిరిపోతుంది.

చేతులు వణకడం వల్ల సర్జరీలో పని చేయలేకపోతుంది. ఆమె ప్రపంచమంతా కన్నీళ్లు, భయం, అవమానంతో నిండిపోతుంది. కానీ ఇక్కడే సినిమా నిజమైన థ్రిల్లర్‌గా మారుతుంది. మిరాండా జైల్లో ఉన్న విలియం‌కు వరుసగా ఉత్తరాలు రాయడం మొదలు పెడుతుంది. మొదట్లో వాటిని తిరస్కరించిన విలియం, క్రమంగా ఆమె మాటలకు లొంగిపోతాడు. జైలు నుంచి పెరోల్‌ పై విడుదలైన తర్వాత మిరాండా అతనికి సహాయం చేస్తానని చెప్తుంది. చెప్పినట్టుగానే, అతన్ని తన తండ్రి ఇంటి పెరట్లో పని చేయించుకుంటుంది. విలియం ఆమె తనను క్షమించి, ప్రేమిస్తోందని భ్రమపడతాడు.

Advertisement

కానీ మిరాండా మనసులో అత్యంత ప్రమాదకరమైన ప్రతీకార ప్రణాళిక దాగి ఉందని తెలుసుకోలేకపోతాడు. ఆమె నర్స్‌గా ఉన్న వైద్య పరిజ్ఞానాన్ని, ఓపికను, తెలివిని ఉపయోగించి విలియం జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకుంటుంది. మరి హీరోయిన్ ఆ సైకోను ఎలా నాశనం చేసింది ? ఆమె ప్లాన్ ఏంటి ? క్లైమాక్స్ లో వచ్చే ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే.

Read Also : హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 సినిమాలు… ఒక్కటి కూడా మిస్ కావొద్దు భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×