E-Paper
Advertisement

Indian Army Jobs: ఆర్మీ లా ఆఫీసర్ జాబ్స్.. ఏడాదికి రూ.17 లక్షలకు పైగా సాలరీ

Indian Army Jobs: ఆర్మీ లా ఆఫీసర్ జాబ్స్.. ఏడాదికి రూ.17 లక్షలకు పైగా సాలరీ
Advertisement

Indian Army JAG Jobs| ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG) ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత కలిగిన న్యాయ పట్టభద్రులు అధికారిక వెబ్‌సైట్ ‘Join Indian Army’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు 2026 ఆగస్టు 17లోపు తమ అప్లికేషన్ పూర్తి చేయాలి.

దేశ సేవతో పాటు న్యాయ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ ఆర్మీలో లీగల్ ఆఫీసర్లుగా సేవలందిస్తారు.

అర్హతలు

Advertisement

ఈ నియామకానికి అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందాలి. అలాగే కనీసం 55 శాతం మొత్తం మార్కులు సాధించి ఉండాలి.
అభ్యర్థులు తప్పనిసరిగా క్లాట్ పీజీ (CLAT PG) 2026 పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పరీక్ష 2025 డిసెంబర్‌లో నిర్వహించారు. అభ్యర్థుల క్లాట్ పీజీ స్కోర్ల ఆధారంగా ఇండియన్ ఆర్మీ తొలి దశలో షార్ట్‌లిస్టింగ్ చేస్తుంది.

అభ్యర్థుల వయస్సు 2027 జనవరి 1 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు అన్ని అర్హతలను పూర్తిగా పరిశీలించడం అవసరం.

జీత భత్యాలు (అంచనా)

Advertisement

ఇండియన్ ఆర్మీలో జడ్జ్ అడ్వకేట్ జనరల్ అధికారిగా లెఫ్టినెంట్ హోదాలో ఎంపికైన వారికి పే లెవల్ – 10 ప్రకారం ప్రారంభ బేసిక్ పే వేతనం రూ.56,100 ఉంటుంది. దీనికి అదనంగా ప్రతి నెల రూ.15,500 మిలిటరీ సర్వీస్ పే లభిస్తుంది. ఇతర అలవెన్సులతో కలిపి వార్షిక సిటిసి సుమారు రూ.17 నుంచి రూ.18 లక్షలు ఉంటుంది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ సమయంలో కూడా నెలకు రూ.56,100 స్టైపెండ్ అందుతుంది. అలాగే డీఏ, హెచ్‌ఆర్‌ఏ లేదా ఉచిత సైనిక నివాసం, రవాణా భత్యం, కుటుంబంతో సహా ఉచిత వైద్య సదుపాయాలు, సిఎస్‌డి క్యాంటీన్ సౌకర్యాలు, రాయితీ ప్రయాణ సదుపాయాలు వంటి అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం

మొదటగా క్లాట్ పీజీ 2026 స్కోర్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది.
ఇంటర్వ్యూ పూర్తైన తర్వాత అభ్యర్థులు వైద్య పరీక్షకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ ప్రదర్శన, వైద్య అర్హత, ఖాళీల సంఖ్య ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

జెఎజీ అధికారుల బాధ్యతలు

జెఎజీ అధికారులు ఇండియన్ ఆర్మీలో న్యాయ అధికారులుగా పనిచేస్తారు. సైనిక అధికారులకు న్యాయపరమైన సలహాలు అందిస్తారు.
కోర్ట్ మార్షల్ కేసులను నిర్వహించడం వారి ప్రధాన బాధ్యతల్లో ఒకటి. అలాగే సైనిక చట్టాలు, సేవా నిబంధనలు, క్రమశిక్షణకు సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తారు.
సైనిక విభాగాలకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందించడం ద్వారా చట్టపరమైన విధానాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తారు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు అధికారిక ‘Join Indian Army’ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ పూర్తిగా చదవండి. అర్హతలకు అనుగుణంగా ఉన్నామో లేదో నిర్ధారించుకోవాలి. తప్పు వివరాలు నమోదు చేస్తే దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంటుంది.
చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది. చివరి రోజు సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

అభ్యర్థులకు సూచనలు

దరఖాస్తు చేసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలి. షార్ట్‌లిస్టింగ్, SSB ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు, తుది ఫలితాలకు సంబంధించిన అన్ని వివరాలను అక్కడే అందులోనే అప్డేట్స్ ప్రకటిస్తారు.

ఇండియన్ ఆర్మీ జెఎజీ ఎంట్రీ స్కీమ్ లా డిగ్రీ గ్రాడ్యూరేట్స్‌కు గౌరవప్రదమైన ఉద్యోగ అవకాశాన్ని అందిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసి ఎంపిక ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×