E-Paper
Advertisement

మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు.. ఆగస్టు ఒకటి నుంచి ధరల మోత, ఏయే వస్తువులో తెలుసా?

మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు.. ఆగస్టు ఒకటి నుంచి ధరల మోత, ఏయే వస్తువులో తెలుసా?
Advertisement

Price changes from August 1: ఒకటో తారీఖు వస్తుందంటే మధ్య తరగతి జీవుడు అల్లాడిపోతుంటాడు. జేబులోకి వచ్చిన జీతం మంచులా కరిగిపోతుంది. దీనికితోడు ధరలు పెరిగితే చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆగస్టు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా సామాన్యుల జేబుకు చిల్లు పడనుంది. నిత్యావసర వస్తువులతోపాటు పలు ఉత్పత్తుల ధరలు పెరగనున్నట్లు మార్కెట్ వర్గాల మాట. పెరిగిన జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి జీవుడికి మరో ఆర్థిక భారం కానుంది.

ఆగస్టు ఒకటి నుంచి ధరల మోత-దేశవ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుంచి మధ్య తరగతి ప్రజలకు మరోసారి షాక్ తగలనుంది. నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, కార్ల వరకు పలు ఉత్పత్తుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు, పామాయిల్ ధరలు పెరగడంతో ప్యాకేజింగ్ సామగ్రి ఖరీదైనదిగా మారింది.

Advertisement

ఇదీ అసలు కారణం-పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించాయి.పెరిగిన రవాణా ఖర్చులు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, దిగుమతి చేసుకున్న ముడి సరుకులు ఖరీదైనవిగా మారాయి. దీంతో ఉత్పత్తి చేసే కంపెనీలకు తయారీ ఖర్చులు అమాంతంగా పెరగడం దీనికి కారణంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.

ఏయే వస్తువులు పెరుగుతాయో తెలుసా?నిత్యావసర వస్తువులు టీ, హెయిర్ ఆయిల్, సబ్బులు, ప్యాక్ ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఆయా ఉత్పత్తుల ధరలు 6 నుంచి 8 శాతం వరకు పెరగవచ్చని ఓ అంచనా. పెరిగిన జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో ఆర్థిక భారం కానుంది.

Advertisement

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని తాము భరించామని కంపెనీలు చెబుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ధరలను మరో 2 నుంచి నుండి 5 శాతం వరకు పెంచడం ద్వారా మిగిలిన ఖర్చులను తిరిగి రాబట్టుకోవాలని చూస్తున్నాయి. ఈ బాటలో వస్త్ర కంపెనీలు దుస్తుల ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి.

ఎలక్ట్రానిక్స్-వాహనాలు ధరలు కూడా- ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో ధరల పెరుగుదల కనిపించడం ఖాయమని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ల వంటి  ధరలు 4- 6 శాతం వరకు పెరగవచ్చని చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడంతో స్మార్ట్‌ ఫోన్ల ధరలు పెరిగే అవకాశాన్ని తోసి పుచ్చలేమని అంటున్నారు. ఆటోమొబైల్ రంగంలో ధరల పెంపు నెమ్మదిగా పెంచుతూ వస్తున్నాయి కంపెనీలు.

ALSO READ: స్విగ్గీ, జొమాటోల ఆటలు సాగవు.. ఆగస్టు 15 నుంచి బహిష్కరిస్తాం.. రెస్టారెంట్ల హెచ్చరిక

ఆగస్టు నుండి మారుతి సుజుకి వాహనాల ధరలను రూ. 30 వేలు పెంచడానికి రెడీ అయ్యింది. హోండా కార్స్, మెర్సిడెస్-బెంజ్ వంటి కంపెనీలు ధరలను పెంచాలని డిసైడ్ అయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపుతుందని ఆర్థిక నిఫుణుల వాదన. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. జీడీపీ వృద్ధి రేటుపై ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తున్నారు.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×