E-Paper
Advertisement

Walking with Barefoot: బేర్‌ఫుట్‌తో మానసిక ఆరోగ్యం మెరుగు.. ఇలా రోజూ నడిచారంటే రోగాలు పరిగెడతాయ్!

Walking with Barefoot: బేర్‌ఫుట్‌తో మానసిక ఆరోగ్యం మెరుగు.. ఇలా రోజూ నడిచారంటే రోగాలు పరిగెడతాయ్!
Advertisement

Walking with Barefoot: రోజులో కొన్ని నిమిషాలు చెప్పులు లేకుండా గడ్డి లేదా నేల మీద నడిస్తే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చెప్పులు లేకుండా నడవటాన్ని ‘బేర్‌ఫుట్‌’ అంటారు. ఈ పద్ధతి పాటిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు నుంచైనా దూరం అవ్వచ్చు. చెప్పులు లేకుండా నడిస్తే.. భూమి శక్తితో అనుసంధానమై శరీరం విద్యుత్ సమతుల్యతను పునరుద్ధరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ బేర్‌ఫుట్‌ వల్ల గుండె ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. ఇప్పుడు చెప్పులు లేకుండా నేలపై నడవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఒత్తిడి దూరం:

బేర్‌ఫుట్ వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. బాగా అలసటగా అనిపించినప్పుడు పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా కొంత దూరం నడిస్తే.. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ప్రశాంతమైన నిద్ర:

Advertisement

చెప్పులు లేకుండా నేలపై నడవటం వలన నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మన శరీరంలోని నిద్ర మేల్కొలుపు చక్రాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.

Read Also: దీన్నింకా మసాలా అనుకుంటున్నారా.. శీతాకాలంలో నల్ల మిరియాలు తీసుకుంటే ఫుల్ హెల్త్!

కీళ్ల నొప్పులు దూరం:

Advertisement

ప్రతిరోజూ బేర్‌ఫుట్‌ వాకింగ్ వలన.. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయని నిపుణులు చెబుతారు. భూమి నుంచి వచ్చే సహజమైన ఎలక్ట్రాన్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయని వారు పేర్కొంటారు.

రక్త ప్రసరణ మెరుగు:

చెప్పులు లేకుండా నడవటం వల్ల పాదాలు, కాళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కండరాలు, కీళ్లు, స్నాయువులు బలపడతాయి. దీంతోపాటు చెప్పులు లేకుండా నడిస్తే.. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని చెబుతారు. ఇది గుండె ఆరోగ్యానికి, మొత్తం శరీరానికి మేలు చేస్తుందని నమ్మకం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

బేర్‌ఫుట్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, వివిధ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు తెలిపారు. అలాగే.. ఉదయం చెప్పులు లేకుండా నేలపై నడవటం వల్ల హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా, హార్మోన్ల పనితీరు మెరుగుపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రించబడతాయి.

Read Also: ప్రతిరోజూ సంగీతం వింటే మతిమరుపుకు కళ్లెం.. తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×