E-Paper
Advertisement

Rashmika Vijay: పెళ్లి జరిగి నాలుగు రోజులు కాలేదు.. పిల్లల పై రష్మిక కామెంట్స్ విన్నారా?

Rashmika Vijay: పెళ్లి జరిగి నాలుగు రోజులు కాలేదు.. పిల్లల పై రష్మిక కామెంట్స్ విన్నారా?
Advertisement

Rashmika Vijay: రష్మిక మందన్న (Rashmika Mandanna) విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెద్ద కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో రకాల రూమర్లు బయటకు వచ్చాయి. ఈ రూమర్లను నిజం చేస్తూ విరోష్ పెళ్లి పీటలు ఎక్కి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీ ఈ జంట ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకున్న ఈ దంపతులు రిసెప్షన్ వేడుకకు కావలసిన ఏర్పాట్లలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తన స్వగ్రామానికి వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

పిల్లల పై రష్మిక ఎమోషనల్ కామెంట్స్..

విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి తర్వాత సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేశారు. ఇక ఈ జంట మార్చి 4వ తేదీ హైదరాబాదులో వివాహ రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. ఇదిలా ఉండగా రష్మిక మందన్న పెళ్లి తర్వాత పిల్లల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక ఇటీవల ఒక సినిమా ప్రమోషన్లలో భాగంగా పిల్లల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పిల్లల కోసం యుద్ధం చేస్తా..

Advertisement

మాతృత్వం గురించి రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను ఇంకా తల్లిని కాలేదు కానీ భవిష్యత్తులో నాకు పిల్లలు పుడతారు. ఆ క్షణం కోసం నేను ఎంతో ఇష్టంగా, ప్రేమగా ఎదురు చూస్తున్నాను. ఇంకా పుట్టని ఆ పసి ప్రాణం మీద ఇప్పుడే నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. వాళ్ల కోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను. పిల్లల క్షేమం కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా, యుద్ధం చేస్తానని అందుకు అనుగుణంగానే నేను ఫిట్ గా ఉంటానని రష్మిక పుట్టబోయే పిల్లల గురించి కామెంట్లు చేయటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెళ్లయిన కొత్తలోనే ఈ జంట సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు మాతృత్వం గురించి ఎంతో బాధ్యతగా మాట్లాడటంతో అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

మార్చి 4న వెడ్డింగ్ రిసెప్షన్…

Advertisement

ఇక పెళ్లి తర్వాత ఈ జంట పలు ఆలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సొంత గ్రామానికి చేరుకున్న విజయ్ రష్మిక తిరిగి నేడు హైదరాబాద్ వెళ్ళనున్నారు. ఇక మార్చి 4వ తేదీ ఈ జంట పెళ్లి రిసెప్షన్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇక వీరిద్దరి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ రష్మిక ఇద్దరూ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ జంటగా రణబాలి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వీరిద్దరికీ సంబంధించిన పస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఏందయ్యా స్వామి అంటూ సాగిపోయే పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ లో స్పెషల్ సాంగ్ .. అందుకే పెట్టలేదన్న డైరెక్టర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×