E-Paper
Advertisement

BJP Criticism: రేవంత్, కేసీఆర్ ఒక్కటే.. తోడుదొంగలుగా మారారు.. బీజేపీ నేత సంచలనం

BJP Criticism: రేవంత్, కేసీఆర్ ఒక్కటే.. తోడుదొంగలుగా మారారు.. బీజేపీ నేత సంచలనం
Advertisement

BJP Criticism: రాష్ట్రంలో పొలిటికల్ టూరిజం నడుస్తోందని బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ అనుకునే సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఇద్దరూ తోడుదొంగలుగా మారారని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పోరాటం చేయడానికి బయటకు రారని, కానీ ఈరోజు ఒక నేతను తమ పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం కేసీఆర్ బయటికి రావడం దురదృష్టకరమన్నారు.

పార్టీ లబ్ధి కోసమే కేసీఆర్ బయటికి వచ్చి ఒక నేతను ఆహ్వానిస్తున్నారని ఎన్వీ సుభాష్ విమర్శించారు. 26 నెలల నుంచి అసెంబ్లీకి రాని కేసీఆర్ రూ.5 కోట్ల వరకు జీత భత్యాలు తీసుకున్నారన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయని కేసీఆర్ కి రూ.5 కోట్లు అవసరమా? అని సుభాష్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సమీక్షలకే పరిమితమైందని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు రేవంత్ రెడ్డి చేప్పిన మాటలేమయ్యాయని నిలదీశారు.

Advertisement

Also Read: కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగుల కష్టాలే పట్టించుకోవడంలేదని ఎన్వీ సుభాష్ ఆరోపించారు. అలాంటిది ఇక ప్రజలకేం న్యాయం చేస్తారని విమర్శించారు. కేసీఆర్ రూ.4 లక్షల కోట్లు సంపాదించుకున్నారని, తామెందుకు సంపాదించుకోకూడదనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మండిపడ్డారు. మహిళలకు వచ్చే హక్కును ఇండియా కూటమి అడ్డుకుందని, మహిళలకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తామని సుభాష్ తెలిపారు.

Advertisement

Also Read: కేసీఆర్ పర్యటనలో డ్రోన్ కలకలం.. భద్రతా లోపమా? ప్రైవేటు వ్యక్తుల పనా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×