// // Bigg Boss 9- బిగ్‌బాస్‌ తనూజపై యష్మి, శ్రీసత్య ట్రోలింగ్‌.. -->
E-Paper
Advertisement

Bigg Boss : బిగ్‌బాస్‌ తనూజపై మాజీ కంటెస్టెంట్స్‌ యష్మీ, శ్రీసత్య ట్రోలింగ్‌.. వీడియో వైరల్‌!

Bigg Boss : బిగ్‌బాస్‌ తనూజపై మాజీ కంటెస్టెంట్స్‌ యష్మీ, శ్రీసత్య ట్రోలింగ్‌.. వీడియో వైరల్‌!
Advertisement

Yashmi Trolls on Bigg Boss 9 Tanuja: రోజురోజుకి బిగ్‌ బాస్‌ షో ఆసక్తి మారుతోంది. రీఎంట్రీ ఇచ్చిన భరణీ కూడా పర్మినెంట్‌ హౌజ్‌మేట్ అయిపోయాడు. దీంతో షో మరింత రక్తికట్టిస్తుందని బిగ్‌ బాస్‌ ప్రియులంత అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ 53 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరా అని పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది. ఈసారి పెద్దగా సెలబ్రిటీలు లేకపోవడం, కామనర్స్‌ నుంచి రావడంతో ఈ సీజన్‌ విజేతలు ఎవరనేది స్పష్టమైన క్లారిటీ రావడం లేదు. కానీ, చాలా మంది మాత్రం ఈసారి ట్రోఫీ తనూజదే అంటున్నారు.

టాప్ కంటెస్టెంట్ తనూజ

Advertisement

తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ఇప్పటి వరకు లేడీ విన్నర్‌ లేరు. బిగ్‌బాస్‌ ఓటీటీ బిందు మాధవి గెలిచింది. కానీ, బిగ్‌ బాస్‌ షో ఇప్పటి వరకు ఏ లేడీ కంటెస్టెంట్‌ విన్నర్‌ కాలేదు. కానీ, తనూజ ఆట తీరు ఈసారి లేడీ కంటెస్టెంటే బిగ్‌ బాస్‌ టైటిల్‌ అంటూ సోషల్‌ మీడియాలో చర్చిస్తున్నారు. హౌజ్‌లో తనూజ ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌, ఇతర హౌజ్‌మేట్స్‌తో తను ఉంటున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఫాలోయింగ్‌ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం హౌజ్‌లో టాప్‌ కంటెస్టెంట్స్‌లో తనూజ మొదటి స్థానంలో ఉంది. దీంతో ఈసారి విన్నర్‌ తనూజ అనే ప్రచారం గట్టిగా సాగుతుంది. ఈ క్రమంలో తనూజకు నెగిటివిటీ కూడా పెరిగింది. ఆమె యాంటి ఫ్యాన్స్‌ ఆమె ఆట తీరుని విమర్శిస్తూ తనూజని ట్రోల్‌ చేస్తుంటారు.

ఈసారి విన్నర్ ఈమె

తాజాగా బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ యష్మి కూడా తనూజపై ట్రోలింగ్‌కి దిగింది. ఈ వీడియోని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. ఇందులో శ్రీసత్య, యష్మీ స్విమ్మింగ్‌లో ఆడుతూ కనిపించారు. శ్రీసత్య యష్మిపై నీళ్లు.. అరే ఎంట్రా నువ్వు.. ముద్దు మాటలు చెప్పి నా చెవులో మందార పువ్వులు పెడుతున్నావ్‌. చీ ఆపేయ్‌ రా. నాకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్‌. ఇది చూడండి ఫ్రెండ్స్‌ ఇది (శ్రీ సత్య) ముద్దు మాటలు చెప్పి చెవులో మందారపువ్వులు పెడుతుంది అని అంటుంటే పక్కనే శ్రీ సత్య ఏడువు రా అంటూ కామెంట్స్‌ చేసింది. ఈ వీడియోలో వారిద్దరి మాటలు వింటుంటే తనూజని టార్గెట్‌ చేశారని అర్థమైపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై తనూజ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

Advertisement

Also Read: Bigg Boss 9 Ramya: హౌజ్‌లో డయోరియా, స్కిన్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డా.. అవేవి చూపించలేదు

యష్మిపై తనూజ ఫ్యాన్స్ ఫైర్

“గత సీజన్‌లో సోనియా హౌజ్‌లోకి వచ్చి నిఖిల్‌ని బ్లేమ్‌ చేస్తుంటే ఎంజాయ్‌ చేసిన నీకు తనూజల స్టాండ్‌ తీసుకునే అమ్మాయిలు ఎందుకు నచ్చుతారులే యష్మి. నువ్వు ఇంత చీప్‌గా ప్రవర్తిస్తావని అనుకోలేదు“,” తనూజ చూస్తే మీకు కుళ్లు” అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ వారం నామినేషన్‌ వీక్‌లో మనీష్‌ వచ్చి కళ్యాణ్‌ని నామినేట్‌ చేస్తూ.. నీకు అర్థం కావడం లేదు ‘భయ్యా.. నీకు ముద్దు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందార పువ్వులు పెడుతున్నారు‘ అని చెప్పాడు. ఆ పాయింట్‌తోనే ఇప్పుడు యష్మి, శ్రీ సత్యలు తనూజపై ట్రోల్‌ కి దిగారని రెగ్యులర్‌గా బిగ్‌బాస్‌ చూసే ఆడియన్స్‌కి ఈజీ అర్థమైపోతుంది. కాగా యష్మి గతంలోనూ తనూజని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్‌ పెట్టింది. కేవలం పీఆర్‌ ల సపోర్టుతోనే తన ఆట కొనసాగుతుందంటూ పరోక్ష కామెంట్స్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టింది. ఇప్పుడు నేరుగా ట్రోల్‌ దిగింది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×