E-Paper
Advertisement

Telangana Politics: మంత్రిగా అజారుద్దీన్.. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్, సీఎం రేవంత్ శుభాకాంక్షలు

Telangana Politics: మంత్రిగా అజారుద్దీన్.. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్, సీఎం రేవంత్ శుభాకాంక్షలు
Advertisement

Telangana Politics: తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, అజార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

Advertisement

శుక్రవారంగా తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోగవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జన్మించిన అజారుద్దీన్‌, అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో చదివారు. ఆ తర్వాత నిజాం కాలేజీలో బీకాం చదివారు.

మేనమామ జైనులాబుద్దీన్‌ స్ఫూర్తితో క్రికెట్‌ వైపు అడుగులు వేసిన ఆయన, 1984లో టీమిండియాలోకి అడుగుపెట్టారు. 90 వ దశకంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆటకు గుడ్ బై చెప్పేసిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు

2009లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్‌ నియోజకవర్గం ఎంపీగా గెలుపొందారు. 2018 లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆయనకు మైనార్టీశాఖను కేటాయించే అవకాశమున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ:  ప్రత్యర్థులకు మంత్రి అజారుద్దీన్ స్ట్రాంగ్ కౌంటర్

అజారుద్దీన్‌ను రేవంత్ కేబినెట్‌లోకి తీసుకోవడంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి.  వాటిని పార్టీ హైకమాండ్ ఏ మాత్రం పట్టించుకోలేదు. కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూసింది. చివరకు  తెలంగాణ ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×