E-Paper
Advertisement

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!
Advertisement

Bigg Boss: చిత్ర పరిశ్రమలో విడాకుల అంశం సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా నచ్చిన వారిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, నచ్చకపోతే విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. అందుకే సెలబ్రిటీలు విడిపోతున్నామని ప్రకటించగానే ఇటు ఆడియన్స్ కూడా లైట్ తీసుకునే రోజులు వచ్చేసాయి అనే చెప్పాలి. ఇకపోతే విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు మరొక తోడును వెతుక్కుంటూ మళ్లీ తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక జంట విడాకులకు సిద్ధమయ్యింది. ప్రముఖ నటి.. బిగ్ బాస్ సీజన్ 19 (హిందీ) విన్నర్ అయిన తన భర్త నుండి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

10 సంవత్సరాల వైవాహిక బంధానికి బ్రేక్..

వారెవరో కాదు ప్రముఖ నటి ఆకాంక్ష చమోలా, గౌరవ్ ఖన్నా.. తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు లాకప్ సీజన్ 2 ప్రీమియర్లో అఫీషియల్ గా ప్రకటించింది. విడివిడిగా ఉంటున్నామని చెప్పిన ఈమె.. ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నాం అంటూ స్పష్టం చేసింది. ఇక దీంతో గత పది సంవత్సరాల వైవాహిక బంధానికి ఈ జంట స్వస్తి పలకబోతుందని చెప్పవచ్చు.

విడాకులు తీసుకోబోతున్నానంటూ క్లారిటీ ఇచ్చిన నటి..

Advertisement

ఈ మేరకు ఈ ప్రీమియర్ షోలో ప్రముఖ నటి ఆకాంక్ష చమోలా మాట్లాడుతూ..” నేను, గౌరవ్ విడాకులు తీసుకుంటున్నాము . గత ఏడాదిగా మేము విడివిడిగానే ఉంటున్నాం. అయితే ఈ విషయం మాత్రం ఎక్కడ బయటకు చెప్పలేదు. నిజానికి మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. నాకు – గౌరవ్ కు మధ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇప్పటికీ మేము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాము. కానీ భాగస్వామ్యులుగా ఒకరికొకరు సెట్ కాలేదని అనుకుంటున్నాము. ఎందుకంటే మేమిద్దరం చాలా విభిన్నమైన ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నాము. అందుకే మాకు వైవాహిక బంధంలో పొసగడం లేదు. ఈ క్రమంలోనే మా ఆలోచనలను ఎవరికి వారి నిజం చేసుకోవడానికి ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నాము అంటూ ప్రకటించింది ఆకాంక్ష చమోలీ.

ఆకాంక్ష , గౌరవ్ ప్రేమ,పెళ్లి..

వీరి ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. గౌరవ్ ఖన్నా , ఆకాంక్ష చమోలా చాలా ఏళ్లుగా తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 2016 నవంబర్ 14న కాన్పూర్ లో వివాహం చేసుకున్నారు. పైగా వీరిద్దరూ బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇన్నేళ్లు సంతోషంగా గడిపిన ఈ జంట ఇప్పుడు విడాకులు ప్రకటించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.పైగా ఆకాంక్ష చెప్పిన కారణాలు నమ్మశక్యంగా లేవని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోయారు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి వాళ్ళిద్దరికీ పొసగడం లేదు కాబట్టి ఇప్పుడు విడిపోతున్నారు అంటూ మద్దతు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఈ జంట విడాకులను మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

also read: కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి.. బాహుబలి పార్ట్ 2 చూస్తానో లేనో అంటూ!

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×