// // Bigg Boss 9 Telugu Day 74 : మదర్ కి కళ్యాణ్ ప్రామిస్ -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 74 : భరణి బాండింగ్స్ పై కూతురు రియాక్షన్… రీతూపై తల్లి కోపం… మదర్ కి కళ్యాణ్ ప్రామిస్

Bigg Boss 9 Telugu Day 74 : భరణి బాండింగ్స్ పై కూతురు రియాక్షన్… రీతూపై తల్లి కోపం… మదర్ కి కళ్యాణ్ ప్రామిస్
Advertisement

Bigg Boss 9 Telugu Day 74 : బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం నడుస్తున్న ఫ్యామిలీ వీక్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే సుమన్ శెట్టి, తనూజా, డెమోన్, సంజన, దివ్య కుటుంబ సభ్యులు వచ్చారు. అలాగే ఈరోజు మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీల నుంచి వచ్చారు.

హద్దులు దాటిన కళ్యాణ్ ఆనందం

ముందుగా కళ్యాణ్ వంతు వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కళ్యాణ్ అభిమానులకు ఈ ఎపిసోడ్ పండగ. కళ్యాణ్ తల్లి హౌస్ లోకి అడుగు పెట్టి “సన్నగా అయ్యావు. బాగా తినురా పిచ్చోడా. మనసులో ఇంత పెట్టుకున్నావా ?” అంటూ తల్లి ప్రేమ చూపించింది. “ఏ విషయం గురించి కంగారు పడొద్దు. అంతా బాగుంది. అవసరం అయిన విషయాల్లో స్టాండ్ తీసుకో. గేమ్ చివర్లో ఉన్నారు కదా ఎవ్వరిని నమ్మకు. కప్పు కొట్టుకుని వస్తానని ప్రామిస్ చెయ్. లేదంటే మీ డాడీ కర్ర పట్టుకుని డోర్ దగ్గరే ఉంటారు” అంటూ కళ్యాణ్ కు గేమ్ గురించి జాగ్రత్తలు చెప్పడంతో పాటు హెచ్చరించింది. “మొన్నటి వరకూ లక్ష్మణ రావు కొడుకు కళ్యాణ్. లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు. ఇప్పుడు కళ్యాణ్ మమ్మి లక్ష్మి. కళ్యాణ్ తండ్రి లక్ష్మణ రావు. ప్రౌడ్ ఆఫ్ యూ మై పేరెంట్స్” అంటూ గర్వంగా ఫీల్ అయ్యాడు. అలాగే తనూజాతో కూడా కళ్యాణ్ తల్లి టైమ్ స్పెండ్ చేసింది. అంతేకాదు చీరను గిఫ్ట్ గా పెట్టి పంపించింది కూడా. కళ్యాణ్ అడిగితే అందరి కంటే నువ్వు నన్ను ఫ్యామిలీలా బాగా చూసుకున్నావ్ అని సింపుల్ గా తేల్చేసింది.

రీతూపై తల్లి ఫైర్

Advertisement

తరువాత హౌస్ లోకి రీతూ తల్లి అడుగు పెట్టింది. ఆమె ఒక్కొక్క కంటెస్టెంట్ ను ఫ్రీజ్ అంటూ కన్ఫెషన్ రూమ్ నుంచే ఓ ఆట ఆడుకుంది. ఇక ఇంట్లోకి వచ్చాక రీతూపై కోపంగా ఉన్నట్టు యాక్ట్ చేసి, తన కూతురిని ఏడిపించింది. అంతేకాదు అట్ల కాడ అందుకుని నాలుగు తగిలిస్తా అంటూ బెదిరించింది. తరువాత రీతూ తన తల్లిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కూతురితో “గేమ్ పై మాత్రమే ఫోకస్ చేయి. కన్ఫ్యూజ్ అవ్వొద్దు. తనూజ నీకు చాలా సపోర్ట్ చేసింది” అని ఇన్ డైరెక్ట్ గా డెమోన్ కు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? అంటూ ఇమ్మూని కూడా అడిగింది రీతూ తల్లి. డెమోన్ తో నామమాత్రంగా మాట్లాడి వెళ్ళింది. దీంతో డెమోన్ ముఖం వాడిపోయింది.

భరణి బాండింగ్స్ గురించి కూతురు రియాక్షన్

చివరగా భరణి ఫ్యామిలీ నుంచి ఆయన కూతురు హనీ (ఆరతి) వచ్చింది. స్టోర్ రూమ్ లో నుంచి వచ్చి సర్ప్రైజ్ చేసింది. తన తండ్రిని చూడగానే ఎమోషనల్ గా పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంది. భరణి కూడా కూతురును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంట్లో అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు భరణి. తరువాత భరణి ఆట గురించి ఆయన కూతురు మాట్లాడుతూ “మీరు హౌస్ లో ఉన్నవాళ్లలో మమ్మల్ని చూసుకుంటున్నారు అని మాకు అర్థమైంది. మీరు పెరిగిన పరిస్థితి అది. అందుకే కూతురు, చెల్లి అంటూ బాండింగ్స్ కలుపుకుంటున్నారు. కానీ అది బయటి వాళ్లకు తెలీదు కదా. మీకు దెబ్బ తగిలినప్పుడు చూడలేకపోయాం. ఎలా ఉంది ఇప్పుడు? లాస్ట్ వీక్ నామినేషన్లలో చూపించిన ఫైర్ కావాలి. కమాండ్ చేసే వాళ్ళకు దూరంగా ఉండు” అంటూ ఆయన గేమ్ గురించి చెప్పింది కూతురు. అంతేకాదు ఈ వీక్ తప్పకుండా కెప్టెన్ కావాలని తండ్రి దగ్గర ప్రామిస్ తీసుకుంది. ఇక చివరగా నాన్నతో మీ బాండ్ ను బాగా ఎంజాయ్ చేస్తాము అని తనూజాను ఆకాశనికెత్తేసింది. కానీ దివ్యకు మాత్రం తన తండ్రిని చూసుకున్నందుకు థాంక్స్ చెబుతూనే, కమాండింగ్ తగ్గించండి అని రిక్వెస్ట్ చేసింది హని.

Advertisement

Read Also : భరణితో బాండింగ్ పై దివ్య తల్లి రియాక్షన్… తెర వెనుక ఇంత కథ నడిచిందా?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×