E-Paper
Advertisement

Raja singh: రాజమౌళి సినిమాలను బహిష్కరించండి.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja singh: రాజమౌళి సినిమాలను బహిష్కరించండి.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Raja singh:దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల వారణాసి సినిమా వేడుకలో హనుమాన్ పై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో హిందూ సంఘాలు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. తాజాగా రాజమౌళి వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమౌళి సినిమాలను బహిష్కరించాలి

రాజమౌళి ప్రతి సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. రాజమౌళి గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, శ్రీకృష్ణుడి దాసీలపై కూడా రాజమౌళి కామెంట్స్ చేశారన్నారు. రాముడిది బోరింగ్ స్టోరీ అని గతంలో ట్వీట్ చేశారు, ఇప్పుడు హనుమంతుడిపై కామెంట్ చేశారన్నారు. ఇలాంటి దర్శకుల సినిమాలను బహిష్కరించాలని రాజాసింగ్ కోరారు.

Advertisement

వీడియోలో ఏమన్నారంటే?

రాజాసింగ్ గురువారం ఓ వీడియో రిలీజ్ చేశారు. దర్శకుడు రాజమౌళి సినిమాలను చూడొద్దని హిందువులకు పిలుపునిచ్చారు. దేవుడిపై విశ్వాసం లేదంటూ అదే దేవుళ్లు, ధర్మంపై సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. సినిమా ప్రచారం కోసం హనుమంతుడిపై కామెంట్స్ చేశారా? నిజంగా నాస్తికుడివా స్పష్టంగా చెప్పాలి? అంటూ రాజాసింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి డైరెక్టర్‌ను హిందువులు పట్టించుకోరన్నారు. గతంలో కూడా హిందూ దేవుళ్లపై ఇష్టారీతిన నోరుపారేసుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి నాస్తికుడు తీసే సినిమాలు జనం చూడకూడదన్నారు. హిందూ ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏమవుతుందో చూపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వీడియో విడుదల చేశారు.

Advertisement

Also Read: Bandi Sanjay: తొందర ఎందుకు బండన్న… ఆర్ఆర్ఆర్ టైంలో పడింది సరిపోదా..? 

రాజమౌళి ఏమన్నారంటే?

గ్లోబ్ ట్రాటార్ ఈవెంట్‌లో సాంకేతిక స‌మ‌స్యలు త‌లెత్తడం, వారణాసి టైటిల్ రివీల్ సమయంలో ఎవరో డ్రోన్స్ ఎగరవేయడంపై రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. తన తండ్రి విజ‌యేంద్రప్రసాద్ మన వెనుక హ‌నుమంతుడు ఉన్నారని, అంత సవ్యంగా జరుగుతుందని చెప్పారన్నారు. ఈ విష‌యంపై రాజ‌మౌళి మాట్లాడుతూ.. తాను మాములుగా దేవుడిని న‌మ్మనన్నారు. నాన్న వచ్చి హనుమాన్ వెనకాల ఉంటారన్నారు.. గుండెతట్టి నడిపిస్తాడని చెప్పారు. ఇలాగానే నడిపించేదని నాకు వెంటనే కోపం వచ్చిందని రాజమౌళి అన్నారు. తన భార్యకు హనుమంతుడంటే చాలా చాలా ఇష్టమని, ఫ్రెండ్‌ లాగా మాట్లాడుత‌ుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. తన భార్య మీద కూడా కోపం వచ్చిందన్నారు. అయితే రాజ‌మౌళి చేసిన వ్యాఖ్యలపై ప‌లు హిందు సంఘాల‌ు, బీజేపీ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×