// // Madhuri Vs Rituఅన్‌హెల్తీ బాండ్.. రీతూ, పవన్‌ దోస్తీపై మాధురీ -->
E-Paper
Advertisement

Madhuri Vs Ritu: మీది అన్‌హెల్తీ బాండ్.. రీతూ, పవన్‌ దోస్తీపై దివ్వెల మాధురీ కామెంట్స్‌.. నెటిజన్స్‌ రియాక్షన్‌ చూశారా!

Madhuri Vs Ritu: మీది అన్‌హెల్తీ బాండ్.. రీతూ, పవన్‌ దోస్తీపై దివ్వెల మాధురీ కామెంట్స్‌.. నెటిజన్స్‌ రియాక్షన్‌ చూశారా!
Advertisement

Madhuri Comments on Ritu Relations: బిగ్‌ బాస్‌ 9 తెలుగు మూడో ప్రొమో కూడా వచ్చేసింది. ఈ రోజు నామినేషన్స్‌ హీట్ మామూలుగా లేదు. నామినేషన్స్‌ చూస్తుంటే ఈ రోజు హౌజ్‌లో రగడ మామూలుగా ఉండదనిపిస్తోంది ప్రొమోలు చూస్తుంటే. తాజాగా విడుదలైన మూడో ప్రొమోలో రీతూని మాధురి నామినేట్‌ చేసింది చూపించారు. ఇక్కడ మాధురి మాట్లాడిన మాటలు నెట్టింట చర్చనీయాంశం అవుతున్నాయి. హెల్తి, అన్‌ హెల్తి బాండ్స్‌ అంటూ మాధురి మాట్లాడటంపై నెటిజన్స్‌ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకి అసలేం జరిగిందంటే.

మాధురిని ఎత్తిపొడిచిన శ్రీజ

Advertisement

ఈ వీక్‌ నామినేషన్‌ ప్రాసెస్‌ని బిగ్ బాస్‌ ఎలిమినేటెడ్‌ కంటెస్టెంట్స్‌ చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. ఎలిమినేట్‌ అయిన ఒక్కొ కంటెస్టెంట్‌కి రెండు కత్తులు ఇచ్చి లోపలికి పంపించి నామినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టించాడు. అలా హౌజ్‌లోకి ప్రియ, మర్యాద మనీష్, ఫ్లోరా షైనీ, భరణి, శ్రేష్టి వర్మ, శ్రీజ దమ్ములు వచ్చినట్టు తెలుస్తోంది. వీరికి రెండు కత్తులు ఇవ్వగా ఒక కత్తిలో వారు నామినేట్‌ చేయాలనుకున్న కంటెస్టెంట్‌ని పొడిచి వివరణ ఇవ్వాలని. మరో కత్తిని హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్‌ కి ఇచ్చి నామినేట్‌ చేయించాలి. అలా హౌజ్‌లోకి వచ్చిన శ్రీజ.. నిన్ను నువ్వు కూడా కరెక్ట్‌గా డిఫెండ్‌ చేసుకోకపోతే ఎలా అంటూ నామినేట్‌ చేసింది. మరో కత్తిని మాధురికి ఇస్తూ.. మాటలతోనే ఎత్తిపొడిచింది. ఎంత బాగా నామినేట్‌ చేస్తారో చూస్తా.. బాండింగ్స్‌ అని చేస్తారో, నార్మల్‌గా చేస్తారో చూస్తా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూనే మాధురికి చేతికి కత్తి అందించింది.

రీతూని నామినేట్

నామినేషన్ రైట్‌ రావడంతో నేరుగా రీతూని పొడిచింది. కళ్యాణ్‌తో టీంలో ప్రతి ఒక్కరు రీతూని నమ్మొద్దని చెప్పారు. అయినా నిన్ను టీంలోనే పెట్టుకున్నా. కానీ, నువ్వు మా టీం నుంచి సంపాదించుకున్న డబ్బును వేరే టీం మెంబర్స్‌కి ఎలా ఇస్తావు, పవన్‌ కంటెండర్‌ చేయడమే కోసం హౌజ్‌ కి వచ్చావా? అంటూ మాధురి రీతూని ప్రశ్నించింది. తాను కంటెండర్‌ అయ్యాక తన డబ్బులు తన ఇష్టమని, ఎవరికైనా ఇచ్చుకుంటా అంటూ రీతూ తనని డిఫెండ్‌ చేసుకుంది. రీతూ పవన్‌కి సపోర్టు చేస్తుందని మాధురి అంటుంటే.. మీరు ఎందుకు వచ్చారు తనూజకి తప్ప ఎవరికి సపోర్టు చేయడం లేదంటూ తిరిగి మాధురికి కౌంటర్‌ ఇచ్చింది. తనూజని సపోర్టు చేయడానికి హౌజ్‌ కి వచ్చారంటూ రెచ్చిపోయింది.

Advertisement

మీది అన్‌ హెల్తీ బాండింగ్

తనూజతో మీది బాండ్‌ కాదా, వాళ్లిందదరిది బాండ్‌ కాదా అంటూ రీతూ ప్రశ్నిస్తుంటే.. వాళ్లందరివి హెల్తి బాండింగ్స్.. మీది అన్‌ హెల్తీ బాండ్‌ అంటూ రీతూ మీద వెళ్లింది. అయితే మాధురి హెల్తి, అన్‌హెల్తి బాండ్‌ అంటూ మాట్లాడటంపై నెటిజన్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. రిలేషన్స్‌ గురించి మాధురి మాట్లాడటం వింతగా ఉందని, రీతూ అలా అంటున్న ఆమె బయట చేస్తుంది ఏంటి? దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌ ఏంటి? అన్‌హెల్తి బాండింగ్స్‌ గురించి రీతూ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరేమో తను హౌజ్‌లో వరకే మాట్లాడుతుంది పర్సనల్‌ లైఫ్‌ని ఇక్కడకు తీసుకురాకండంటూ ఆమె సపోర్టర్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మాధురిలో అంత రెచ్చిపోతున్న రీతూ మాత్రం తన హద్దులు దాటటం లేదని, చాలా కరెక్ట్‌గా తనని తాను డిఫెండ్‌ చేసుకుంటుందూ రీతూ ఆటని కొనియాడుతున్నారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×