E-Paper
Advertisement

Thiruveer : ప్రభాస్ సినిమాలలో అవకాశం మిస్ చేసుకున్న యంగ్ హీరో తిరువీర్ 

Thiruveer : ప్రభాస్ సినిమాలలో అవకాశం మిస్ చేసుకున్న యంగ్ హీరో తిరువీర్ 
Advertisement

Thiruveer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో తిరువీరు ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన తిరువేరు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. తిరువీరు లోని ఎంత గొప్ప నటుడు ఉన్నాడు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను చేసిన ఎన్నో పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.

అయితే ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు తిరువీర్. ఒకవైపు హీరోగా సినిమాలు చేయటం వలన మరోవైపు చాలా పెద్ద సినిమాల్లో కూడా అవకాశాలు మిస్ అయిపోయాను అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.

ప్రభాస్ సినిమాలు మిస్ 

Advertisement

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో హీరోగా చిన్న సినిమాలు చేయటం వేరు ప్రభాస్ సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించడం వేరు.

ఇక కొన్ని సినిమాల్లో హీరోగా చేయడం వలన నటుడు తిరువీర్ చాలా అవకాశాలను ప్రభాస్ సినిమాల్లో కోల్పోయాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తిరువీరు మాట్లాడుతూ నాకు చాలా కంటిన్యూటీ షూటింగ్స్ ఉన్నాయి. నాకు హను రాఘవపూడి గారితో వర్క్ చేయడం చాలా ఇష్టం. ఆయన విజువల్స్ కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఫౌజీ సినిమా చేయడానికి కుదరలేదు.

Advertisement

కేవలం ఫౌజీ మాత్రమే కాదు మరోవైపు సలార్ సినిమా కూడా నాకు మిస్ అయిపోయింది. సలారు సినిమాలోని కాటేరమ్మ ఫైట్ యాక్టర్ ఉన్నారు కదా అది యాక్చువల్ గా నేనే చేయాల్సిందే. ఈ సినిమాలో నేను మిస్ అయినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. అలానే మనకు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది. ఏది వస్తే అది మనది అని ఫీల్ అవుతాను.

అవి చేసి ఉంటే నటుడుగా మంచి గుర్తింపు 

తెలుగులో తిరువీరు నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నటుడుగా ప్రూవ్ అయిపోయాడు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించాలి అంటే ప్రభాస్ సినిమాలో ఆ పాత్రలు చేసి ఉంటే నటుడుగా నెక్స్ట్ లెవెల్ గుర్తింపు వచ్చేది అనేది చాలామంది అభిప్రాయం.

Also Read: Samantha: క్రేజీ కాంబినేషన్ రిపీట్, నందిని సమంతకు ఈ సినిమా హిట్ కీలకం కీలకం

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×