E-Paper
Advertisement

Pothula Suneetha: పోతుల సునీత రాంగ్ స్టెప్.. బీజేపీలో చేరి పొరపాటు చేశారా?

Pothula Suneetha: పోతుల సునీత రాంగ్ స్టెప్.. బీజేపీలో చేరి పొరపాటు చేశారా?
Advertisement

Pothula Suneetha:  టిడిపి , వైసీపీల్లో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరి పొరపాటు చేశారా? … రాజకీయాల్లోకి వచ్చిన నాటినుండి ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ వచ్చిన ఆ మహిళా నేత సైలెంట్ అవ్వడం వెనుక కారణం ఏంటి? మూడు సంవత్సరాల పదవీ కాలం ఉన్న ఎమ్మెల్సీ పదవిని కాదని పార్టీ మారిన ఆమె తప్పు చేశారని సొంత అనుచరులే ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? అసలు వైసీపీ నుంచి కమలం గూటికి చేరిన పోతుల సునీతకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి?

టీడీపీలో రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టిన పోతుల దంపతులు

పోతుల సునీత, ఆమె భర్త సురేష్… ఇద్దరూ మాజీ నక్సలైట్లు. జనజీవన స్రవంతిలో కలిసాక ఆ దంపతులు తొలుత తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారికి పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించారు. 2014 ఎన్నికల్లో చీరాల టిడిపి అభ్యర్థినిగా పోతుల సునీతకు అవకాశం కల్పించారు. ఘనంగా రాజకీయ ప్రవేశం చేసిన పోతుల సునీత ఎన్నికల్లోను తనదైన సత్తా చూపారు. 2014లో చీరాలలో జరిగిన త్రిముఖ పోరులో ఆమె రెండవ స్థానానికి పరిమితమయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమిపాలయ్యారు.

2017లో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన టీడీపీ

Advertisement

అయితే అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం పోతుల సునీతకు తగిన గుర్తింపుని ఇచ్చింది. 2017లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోతుల సునీతను పార్టీ తరఫున ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసిపి అధికారంలోనికి వచ్చిన తర్వాత… 2020లో టీడీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత వైసీపీలో చేశారు. ఆ సమయంలో మరో మూడేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్… పోతుల సునీతను వైసీపీ తరఫున ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా చేశారు. ఆమె వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.

వైసీపీకి గుడ్ బై.. పోతుల సునీత

అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే గతేడాది ఆగస్టులో పోతుల సునీత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పంపారు. మరో మూడేళ్ల ఎమ్మెల్సీ పదవీకాలం ఉన్నప్పటికీ… తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత పోతుల సునీత తిరిగి తన సొంతగూడు టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జరిగినప్పటికీ… ఆ దిశలో అడుగులు పడలేదు.

బీజేపీలోకి పోతుల సునీత ఎంట్రీ

Advertisement

సునీత టీడీపీలో చేరికను కూటమి నేతలతో పాటు టీడీపీ అధిష్టానం కూడా వ్యతిరేకించిందట… వైసిపి మహిళా అధ్యక్షురాలిగా పోతుల సునీత చేసిన హాట్ కామెంట్స్ కారణంగా ఆమెకు టీడీపీ తలుపులు పూర్తిగా మూసుకుపోయాయట. దీంతో సంవత్సరం పైగా సైలెంట్ అయిన సునీత రీసెంట్‌గా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు .జేపీ నడ్డాను కలిసిన పోతుల సునీత… ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. గతేడాది ఆగస్టులో వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సుమారు ఏడాది కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయిన పోతుల సునీత… తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ కార్యాక్రమాల్లో యాక్టివ్ కాలేకపోతున్న సునీత

అయితే బీజేపీలో చేరిన పోతుల సునీత ఆ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారట… దీంతో పోతుల సునీత అనుచరగణం ఆమె కాషాయ పార్టీలో ఇమడలేకపోతున్నారనే ప్రచారాన్ని ముమ్మరం చేశారట.. అటు బిజెపి పార్టీ కూడా ఆమెకు తగిన స్థానం కల్పించలేదని భావన ఉందట… ఏ పార్టీలో చేరినా తగిన పదవితో పాటు మంచి గుర్తింపును పొందిన సునీత….. బిజెపిలో మాత్రం ఎటువంటి గుర్తింపు పొందలేకపోవటంతో తప్పు చేశానని అంతర్మధనం చెందుతున్నారట.

చెప్పుకోదగ్గ రాజకీయ ప్రాధాన్యత లేని సునీత

చెప్పుకోదగ్గ రాజకీయ ప్రాధాన్యత లేకుండానే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ సునీత ఏ పార్టీలో చేరినా…. ఇప్పటి వరకు సముచిత స్థానమే పొందుతూ వచ్చారు. అటు టిడిపిలోను… ఇటు వైసిపి లోను ఎమ్మెల్సీగా పదవులు అనుభవించారు. వైసీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంతో పాటు పార్టీ మహిళా అధ్యక్షురాలు హోదాను కూడా కట్టబెట్టింది… గౌరవం ఇచ్చిన రెండు పార్టీలలోను పూర్తిస్థాయి పదవిని నిర్వహించకుండానే అధికారం ఉన్న వైపుకు అడుగులేసిన ఆమెను తిరిగి ఆ పార్టీలు దగ్గర చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదట.

దీంతో పోతుల సునీత తన భవిష్యత్తు రాజకీయాలను కాపాడుకోవడానికి బీజేపీలో చేరారని, అక్కడ కూడా తిరిగి ఎమ్మెల్సీ హోదా పొందుతారని, ఆమె వర్గీయులు చెప్పుకుంటూ వచ్చినా అక్కడ సముచిత స్థానం లభించకపోవడంతో పొరపాటు చేశారని డైరెక్ట్‌గానే విమర్శిస్తున్నారు. అధికారం అనేది శాశ్వతం కాదని గుర్తుంచుకొని గౌరవించిన పార్టీలో ఉన్నట్లయితే ఆ హోదా గౌరవం ఉండేవని….. అలా చేయకుండా అధికారం వెంట పరుగులు పెట్టడమే ఆమెకు మైనస్ గా మారిందంటున్నారు.

బిజేపీని సునీతను పట్టించుకోవడం లేదా..?

వైసిపిలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన సునీత ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ సంవత్సరం పాటు జరిగింది. ఒక వర్గం టిడిపి అనగా మరో వర్గం కూటమీ పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరతారని ప్రచారం అయితే నడిచింది. ఆ క్రమంలో సునీత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి రెండు నెలలవుతున్నా … ఇంతవరకు పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్‌ కాలేకపోతున్నారు. బిజెపి సునీతను పట్టించుకోవడంలేదా?. సునీతే దూరంగా ఉంటున్నారా? అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది.

తన రాజకీయ భవిష్యత్‌ విషయంలో సునీత గందరగోళంలో ఉన్నారా? లేక అయోమయ స్థితిలో ఉన్నారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగా సునీత ఎదగకుండా కూటమి పార్టీలకు చెందిన నాయకులు అడ్డుకుంటున్నారా?… అనే అనుమానాలు కూడా ఆమె అనుచరవర్గం వ్యక్తం చేస్తోంది. గత పార్టీలలో లాగే కమలం పార్టీలో కూడా సునీత చక్రం తిప్పగలుగుతారో? లేదో చూడాలి.

Story by Apparao, Big Tv

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×