E-Paper
Advertisement

Kaleshwaram: కేటీఆర్ సవాల్‌కు సర్కార్ కౌంటర్.. కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ హీట్ పాలిటిక్స్!

Kaleshwaram: కేటీఆర్ సవాల్‌కు సర్కార్ కౌంటర్.. కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ హీట్ పాలిటిక్స్!
Advertisement

Kaleshwaram: కాళేశ్వరం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. కేటీఆర్ కన్నేపల్లి టూర్ తో మళ్లీ పొలిటికల్ సెగలు పీక్స్ కు చేరాయి. AE, DE, SEలను ఇవ్వండి.. వారం రోజుల్లో రిజర్వాయర్లలో నీటిని నింపుతామంటున్నారు కేటీఆర్‌. అసలు ఆ పని చేయలేం.. నీటి నిల్వ చేయవద్దని NDSA చెప్పిందంటున్నారు మంత్రి ఉత్తమ్‌ ఇద్దరి మాటల్లో వాస్తవం ఏంటి అనేది పక్కనబెడితే ఇది పూర్తిగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్నది మాత్రం కన్ఫామ్‌.

రివర్స్‌ ఎటాక్‌..

రెండు పిల్లర్ల సమస్యను ప్రాజెక్టు సమస్యగా మార్చారని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. ఇది రెండు పిల్లర్లు, రెండు గేట్ల సమస్య కాదని.. టోటల్‌ గా ప్రాజెక్టు సమస్యే అని రివర్స్‌ ఎటాక్‌ చేశారు మంత్రులు. ఒకవేళ మొండిగా నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాచలం పట్టణంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని ఇంజినీర్లు హెచ్చరించినట్లు మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు.

Advertisement

Also Read: Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?

అది పొలిటికల్‌ టూర్‌..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లో లోపాలు, కుంగిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. NDSA నిపుణుల కమిటీ సిఫారసులతో, నిర్మాణ సమస్యలు, కుంగిపోయిన పిల్లర్ల కారణంగా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్లే బ్యారేజీల గేట్లను ఎత్తివేసి, నీటిని ఫ్రీ ఫ్లో కింద రివర్‌ లోకి వదిలేస్తున్నారు. బ్యారేజీలకు రిపేర్లు పూర్తి అయ్యే వరకు CWC, NDSA నుండి క్లియరెన్స్ వచ్చే వరకు వాటర్‌ స్టోరేజ్‌ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు కేటీఆర్‌ ఎన్నిసార్లు కాళేశ్వరం టూర్‌ చేపట్టినా.. అది పొలిటికల్‌ టూర్‌ అని ప్రభుత్వం నుంచి కౌంటర్లు వస్తూనే ఉంటాయి.

Advertisement

Also Read: Ayodhya Donations: అయోధ్య సిట్ విచారణలో షాకింగ్ నిజాలు.. రోజుకు రూ.8 లక్షలు నొక్కేస్తూ లగ్జరీ లైఫ్..!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×