E-Paper
Advertisement

Ayodhya Donations: అయోధ్య సిట్ విచారణలో షాకింగ్ నిజాలు.. రోజుకు రూ.8 లక్షలు నొక్కేస్తూ లగ్జరీ లైఫ్..!

Ayodhya Donations: అయోధ్య సిట్ విచారణలో షాకింగ్ నిజాలు.. రోజుకు రూ.8 లక్షలు నొక్కేస్తూ లగ్జరీ లైఫ్..!
Advertisement

Ayodhya Donations: చిన్న కథ కాదు.. ఇది ఎవరి గురించో కాదు.. అయోధ్య రామమందిరం విరాళాలు పక్కదారి పట్టించిన నిందితుల గురించి.. ప్రతిరోజూ లక్షలకు లక్షలు నొక్కేశారాట.. సిట్‌ విచారణలో ఆ సొమ్ముతో విల్లాలు, జల్సాలు, పెద్దపెద్ద కార్లు కొని లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.

షాకింగ్ విషయాలు..

అయోధ్య విరాళాలపై SIT దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. అక్రమార్కులు రోజుకు ఏకంగా రూ.6 నుంచి రూ.8 లక్షల మధ్య నొక్కేశారని సిట్‌ అధికారుల అంచనా వేస్తున్నారు. బ్యాంక్ అధికారులను సిట్ ప్రశ్నించడంతో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. అక్రమాలు జరగకముందు వరకు రామజన్మభూమి తీర్థ ట్రస్టు బ్యాంక్ ఖాతా రోజుకు రూ.16-18 లక్షలు వరకు జమయ్యేవి.. ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా రూ.24-26 లక్షలకు పెరిగాయి. ఈ ప్రకారం రోజుకు 8 లక్షల వరకు కాజేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Also read: Bandi Bhagirath: బండి భగీరథ్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. కేసులో అదనంగా మరో రెండు సెక్షన్లు!

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా..

8 మంది నిందితుల్లో ఐదుగురు అనుమానాస్పదంగా సీసీటీపీ ఫుటేజీల్లో కనిపించారు. వీరు విరాళాలు లెక్కించేప్పుడు, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు, షూ సాక్సులో దాచేసి నగదును పక్కదారి పట్టించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా వీరు నియమితులయ్యారు. నిందితుల్లో ఒకరైన ఔట్‌సోర్స్‌ ఉద్యోగి అవినాష్‌ శుక్లా.. ఆలయ ఉద్యోగిగా నియామకం కాకముందు హనుమాన్‌ గుహ వద్ద వాటర్ ప్లాంట్ నిర్వహించే వాడని తెలుస్తోంది. అతడినుంచి అయోధ్య పోలీసులు మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీని సీజ్‌ చేశారు.

మరో నిందితుడైన..

Advertisement

మరో నిందితుడైన లవ్‌కుష్‌ మిశ్రా.. గతేడాది బనీపూర్‌లో వెయ్యి చదరపు అడుగుల ప్లాట్‌ కొనుగోలు చేసినట్టు వెలుగు చూసింది. రిజిస్టర్డ్‌ విలువ రూ.8లక్షలే ఉన్నప్పటికీ, మార్కెట్‌ విలువ రూ.25లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మరో నిందితుడైన రామ్‌ శంకర్‌ అలియాస్‌ టిన్ను గతంలో డ్రైవర్‌గా పనిచేయగా, విరాళాల సొమ్ముతో ఒక హాస్టల్‌ను ఓపెన్‌ చేసినట్లు సమాచారం.

Also read: Prashna Ravan: యూట్యూబర్ రావణ్ ఫోన్‌లో మావోయిస్ట్ భావజాలం.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×