E-Paper
Advertisement

కారు మీద గీతలు పడ్డాయా? డోంట్ వర్రీ.. సింఫుల్ గా ఇంటి దగ్గరే రిమూవ్ చెయ్యొచ్చు!

కారు మీద గీతలు పడ్డాయా? డోంట్ వర్రీ.. సింఫుల్ గా ఇంటి దగ్గరే రిమూవ్ చెయ్యొచ్చు!
Advertisement

Car Scratch Removal Guide: కారు మీద చిన్న గీతలు లేదంటే డెంట్లు పడితే చాలా మందికి యమానులు చాలా ఫీలవుతారు. సిటీలో పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ రద్దీ  కారణంగా చిన్నపాటి డ్యామేజ్‌ లు సాధారణమే అయినా, అయ్యో అని బాధపడుతారు. అయితే, ప్రతి చిన్న గీత కోసం గ్యారేజ్‌కి వెళ్లి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక  ఉంటే, కొన్ని సింపుల్ ట్రిక్స్‌ తో ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా గీతలను శుభ్రం చేయాలి!

మొదటగా గీతలు పడ్డ ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి. కార్ షాంపూ, నీటిని ఉపయోగించి క్లీన్ చేయాలి. దుమ్ము, మురికి పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే, మురికి ఉండగానే రుద్దితే మరింత గీతలు పడే ప్రమాదం ఉంటుంది. తర్వాత మృదువైన గుడ్డతో ఆ భాగాన్ని తుడిచి ఆరబెట్టాలి. శుభ్రంగా ఉన్నప్పుడు గీత ఎంత లోతుగా ఉందో  స్పష్టంగా తెలుస్తుంది.

స్క్రాచ్ రిమూవర్ వాడండి!  

Advertisement

గీతలు చాలా చిన్నవిగా ఉంటే, మార్కెట్లో దొరికే స్క్రాచ్ రిమూవర్ లేదంటే రబ్బింగ్ కాంపౌండ్ వాడాలి. ఇవి పెయింట్ పై ఉండే క్లియర్ కోట్‌ ను స్మూత్‌ గా చేసి, చిన్న గీతలను తగ్గిస్తాయి. ఒక మృదువైన గుడ్డపై కొద్దిగా తీసుకుని, సున్నితంగా వృత్తాకారంలో రుద్దితే మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఎక్కువగా ప్రెజర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 టచ్ అప్ పెయింట్ ఉపయోగించండి

ఒకవేళ గీత లోతుగా ఉండి, పెయింట్ లేయర్ దెబ్బతిన్నట్లయితే, టచ్ అప్ పెయింట్ ఉపయోగించడం మంచిది.  కార్ కలర్‌కు సరిపోయే పెయింట్‌ను తీసుకుని, చిన్న బ్రష్‌తో జాగ్రత్తగా గీత మీద పూయాలి. అది పూర్తిగా ఎండిన తర్వాత తేలికగా పాలిష్ చేస్తే, గీత చాలా వరకు కనిపించకుండా పోతుంది. ఈ విధానం కొంచెం ఓపిక అవసరం అయినప్పటికీ, మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వేడి నీటిని ఉపయోగించండి!

Advertisement

ప్లాస్టిక్ బంపర్లపై చిన్న డెంట్‌ లు ఉంటే, వేడి నీరు ఉపయోగించడం సింపుల్ ట్రిక్. డెంట్ ఉన్న భాగంపై కొంచెం వేడి నీరు పోస్తే, ప్లాస్టిక్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఆ సమయంలో లోపల నుంచి నెమ్మదిగా నెట్టితే, డెంట్ సరిగా వచ్చేయే అవకాశం ఉంటుంది. కానీ, నీరు చాలా వేడిగా ఉండకూడదు, లేకపోతే మరింత నష్టం కలుగుతుంది.

సక్షన్ డెంట్ పుల్లర్ ఉపయోగించండి!

ఐరన్ భాగాల్లో చిన్న డెంట్ల కోసం సక్షన్ డెంట్ పుల్లర్ ఉపయోగించవచ్చు. ఇది ఆటో స్టోర్లలో దొరుకుతుంది. డెంట్ మీద గట్టిగా అమర్చి, మెల్లగా లాగితే చిన్న గుంతలు సరిచేయవచ్చు. అయితే, చాలా లోతైన, షార్ఫ్ డెంట్లపై ఇది పని చేయదు. ఒకవేళ సరిగా వాడకపోతే మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకేవళ పెద్ద డెంట్లు, లోతైన గీతలు ఉంటే, గ్యారేజీకి తీసుకెళ్లడం మంచిది.

Read Also: ఈ డ్యాష్ కామ్ ఉంటే.. యాక్సిడెంట్లే జరగవ్, రికార్డింగే కాదు అలర్ట్ కూడా చేస్తుంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×