E-Paper
Advertisement

బొద్దింక‌లతో ప‌రాభ‌వం.. ఎంపీల‌ ఘ‌నస్వాగ‌తం..! ప‌దవి పోయినా ప్ర‌ధాని పుర్స‌త్‌..!

బొద్దింక‌లతో ప‌రాభ‌వం.. ఎంపీల‌ ఘ‌నస్వాగ‌తం..! ప‌దవి పోయినా ప్ర‌ధాని పుర్స‌త్‌..!
Advertisement

ప‌ద‌వి పోయినా ప్ర‌ధాన్ పుర్స‌త్‌ల‌నే ఉన్న‌డు. ఏందో మ‌త‌లబు? గింత‌గానం అవ‌మానం జ‌రిగినా.. ఇంకా బుద్ది రాలేదా? గింత‌కుడా సిగ్గ‌నిపిస్త‌లేదా? అని కూడా అనుకుంటున్న‌రంట జెన్‌-జీ పోరాగాళ్లు. ఎందుకంటే.. ఇగో ఇయ్యాళ‌.. గీన ఏదో ఘ‌న‌కార్యం ఎల‌గ‌బెట్టి ఒచ్చిన‌ట్టుగా.. తోటి ఎంపీలంతా క‌లిసి ఆయ‌నను పార్లమెంటుల‌కు ఘ‌న‌మైన స్వాగ‌తం ప‌లికి మ‌రీ తోల్క‌చ్చిర్రు.

నెత్తి మీద ఓ పాగా.. శాలువాతో స‌న్మానాలు.. పూల‌దండల‌తో మ‌ర్యాద‌లు.. అబ్బ‌బ్బ చెప్పొద్దిగ‌.. గుర్రం మీద కూసోబెట్టి ఆ పార్ల‌మెంటంతా ఊరేగించుడే త‌క్కువుండే అనుకో! అగో అట్ల చేసిర్రు మ‌రి మ‌న బీజేపీ ఎంపీలు. మ‌రి మా సోప‌తిగాన్నీ ఇన్ని తిప్ప‌లు బెట్టి మంద్రి ప‌ద‌వి ఊడ‌బీకిస్తారు..? ఇగ సూస్కోర్రి జిల్ల పురుగుల్లారా? గీ ప‌ద‌వో లెక్క కాదు మాకు.. మా మోడీ సాబే మాకు పెద్ద దిక్కు. గురువు.. దేవుడు. ఆయ‌న చెప్పిండు కాబ‌ట్టి.. ఇగ గీ ప‌ద‌వి గ‌డ్డి పోచ‌లెక్కోలే పీకి పాడేసినం.. గానీ మీరంతా మాదే విజ‌యం.. మేమే గెల్సినం… అని సంక‌లు గుద్దుకోబ‌డ్తిరి.

Advertisement

కానీ గెల్సింది మేమేరా బై.. అవ్ మ‌ళ్లా.. మాదే రాజ్యం.. మేమే ఇంకా పది కాలాలు ప‌చ్చ‌గా ఉండి రాజ్య‌మేలేటోళ్లం.. మోడీ సాబ్ త‌లుచుకుంటే గిసొంటి మంతిరి ప‌ద‌వులు అవే మా దగ్గ‌రి దాకా దేక్కుంటా వ‌స్త‌యి! ఇక ఈళ్లే ఇట్లుంటే మ‌న ప్ర‌ధాన్ ఏమ‌న్నా త‌క్కువ తిన్న‌డా..? నేనమ‌న్నా తుతుంబ‌ర్ గాడ్న‌న‌నుకున్నారు..? స్ట్రీట్ ఫైట‌ర్‌ను.. గ‌ల్లీల కొట్లాడి కొట్లాడి ఢిల్లీ దాన్కా వ‌చ్చిన‌.. గిసుంటియి ఎన్ని సూడ్లేదు. గా పోర‌గాళ్లు నాకో లెక్క‌నా.. జిల్ల ప‌రుగులన్నీ ఏక‌మైనా మ‌మ్మ‌ల్నేం చేయ‌వు.. కానీ ఎందుకో మా మోడీ సాబు.. వెన‌క్కి త‌గ్గిండు.. జ‌ర్రంత భ‌య‌ప‌డ్డ‌డు.. విశ్వ‌గురు పేరుకు జ‌ర్రంత మ‌చ్చరాగిల అని అనుకున్న‌డే ఏం పాడో.. అందుకే బ‌ల‌వంతానా.. మ‌న‌సొప్పీ ఒప్ప‌క‌.. ఇష్టం లేక‌నే.. బాధ‌తో..గుడ్ల‌ల్ల నీళ్లు తీస్కుని మ‌రీ చెప్పిండు.. ఇగ రిజైన్ చేసేయ్ వ‌యా.. మ‌ళ్లా నిన్ను జూస్కుంటా గానీ! అని అన్న‌డు.

అంతే ఇట్ల రాసి ఇచ్చి ప‌డేసిన‌.. ఏదో అనాలె కాబ‌ట్టి.. పిల్ల‌ల బాధ చూడ‌లేక రిజైన్ చేసినా అని చెప్పిన గానీ, మా మోడీ బాధ చూడ‌లేక‌నే నేనా ప‌నిచేసిన‌. అది మాకు మాకే ఎర్క‌. అందుకే మా తోటోళ్లంతా పెద్ద సారు కోసం నేను చేసిన త్యాగాన్ని గుర్తిచ్చి ఇట్ల స‌న్మానం కూడా చేయ‌బ‌ట్టిరి. ఇంకా ఇంతక‌న్న మ‌ర్యాదేం కావాలే.

Advertisement

జైలుకు పోయి వ‌చ్చినోళ్ల‌కు సీఎంగిరీ వ‌స్తద‌నే జాత్కం ఎట్లుందో.. ఇట్ల మ‌ధ్య‌లకెళ్లి రిజైన్ చేసినోళ్ల‌కు అంత‌కు మించి ప‌ద‌వి భాగ్యం ప‌డిశం ప‌ట్టిన‌ట్టు పడ్త‌ద‌ని కూడా ఉంది.. మీకు తెలుసా.. అయితే తొంద‌ర్ల‌నే తెలుస్త‌ది… గా జిల్ల పురుగులు అనుకుంటున్న‌యి.. మంత్రి ప‌ద‌వి పీకిపిచ్చి ప‌రాభ‌వం చేసిన అని.. కానీ ఆళ్లు నా మ‌ర్యాద పెంచిర్రు.. ఇగో ఇట్ల‌.. కొత్త పెళ్లి కొడుకును గుర్ర‌మెక్కచ్చిన‌ట్టు.. నాకు ఎన్ని మ‌ర్యాదల చేస్తున్న‌రో క‌దా.. ! అందుకే ప‌ద‌వి పోయినా నేను పుర్స‌త్‌గనే ఉన్నా.. మీరేం ఫిక‌రు చేయ‌కుర్రి మిత్రో.. మ‌న‌దే రాజ్యం.. మ‌న‌మేం ఉంటాం.. మ‌న‌మే ఏలుతం.. ఏళ్ల త‌ర‌బ‌డి.. ఎనీ డౌట్‌!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×