E-Paper
Advertisement

అర్థరాత్రి మట్టి మాఫియాకు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!

అర్థరాత్రి మట్టి మాఫియాకు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!
Advertisement

Illegal Mining: శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూడుచింతలపల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతానికి ఎదురుగా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 24 రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మూడుచింతలపల్లి రైతు వేదిక దాటి అటవీ ప్రాంతం ఎదురుగా కొందరు అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.

మూడు టిప్పర్ లారీలు..

ఎస్‌హెచ్‌వో ఆదేశాల మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా రెండు జేసీబీలు, ఒక టిప్పర్ లారీతో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అనంతరం మట్టి తరలించేందుకు మరో మూడు టిప్పర్ లారీలు అక్కడికి చేరుకున్నాయి. విచారణలో జేసీబీ డ్రైవర్లు రషీద్, సద్ది ఖాన్, టిప్పర్ యజమాని-డ్రైవర్ వంగ రాజిరెడ్డి, అలాగే టిప్పర్ డ్రైవర్లు శేఖర్, శ్రీకాంత్, చందన్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండానే మట్టి తవ్వి తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా ‘బిగ్ టీవీ’ రీలాంచ్.. గ్రూప్ ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డి!

కేసు నమోదు..

ఈ తవ్వకాలు వంగ రాజిరెడ్డి, తిప్పరబోయిన శివ, పొన్న మధు, శివరాత్రి సాయి ఆదేశాల మేరకు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఘటనలో ఉపయోగించిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Also Read: జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×