E-Paper
Advertisement

E85 Fuel: సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా.. కేంద్రం గుడ్ న్యూస్..?

E85 Fuel: సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా.. కేంద్రం గుడ్ న్యూస్..?
Advertisement

E85 Fuel: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది అనే చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. చెప్పినట్టుగానే E85 ఫ్యూయల్ స్టేషన్‌ను ప్రారంభించింది. కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి చేతుల మీదుగా ఢిల్లీలో ఈ అవుట్‌లెట్‌ ప్రారంభమైంది.

ధర లీటరు 102

E85 అనేది 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిక్స్‌ అయిన ఉన్న పర్యావరణహిత ఇంధనం. ఢిల్లీలో E85 లీటర్ ధరను 82 రూపాయల 12 పైసలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీలో E20 పెట్రోల్ ధర 102 రూపాయలుగా ఉండగా, దానితో పోలిస్తే E85 లీటర్‌పై 20 తక్కువ అనే చెప్పాలి. అంటే ఇథనాల్ వెహికిల్స్‌కు మారితే ఇంధన ఖర్చు భారీగా తగ్గుతుందన్నమాట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48 పెట్రోల్ బంకుల్లో తొలి విడతగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి 500 పెట్రోల్ బంకులు.. 2027 డిసెంబర్ నాటికి 5 వేల బంకుల్లో ఈ కొత్త ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. పెట్రోల్‌లో 20-100 శాతం వరకు ఇథనాల్ కలిపినా.. పనిచేసే ఇంజిన్ల కోసమే ఈ కొత్త ఇంధనం వాడాల్సి ఉంటుంది. ఇది ప్రజలు గమనించాలి.

15 శాతం పెట్రోల్..

Advertisement

ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్‌కు తగ్గట్టుగా వాహనాలను కూడా రూపొందిస్తున్నాయి కంపెనీలు. మారుతీ సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వ్యాగన్ ఆర్.. దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారుగా నిలిచింది. ఈ కారు ఇంజిన్‌లో 15 శాతం పెట్రోల్ 85 శాతం ఇథనాల్ మిశ్రమంతో పనిచేస్తుంది. ఈ మోడల్ E100 ఇంధనంతో కూడా దూసుకుపోతుంది. మారుతీ సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లను లాంఛ్ చేయకముందే.. హీరో మోటోకార్ప్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ కలిగిన మోటార్ సైకిల్స్‌ను రిలీజ్ చేసింది. స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్‌ను ఇండియన్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురీ వీటిని ఆవిష్కరించారు.

Also read: పాపం అల్లరి నరేష్ హీరోయిన్‌కి ఎంత కష్టం వచ్చింది.. తన కుక్కను చంపేశారంటూ..

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు

Advertisement

E85 వాడకంతో గ్రీన్ హౌస్‌ గ్యాస్‌ల రిలీజ్‌ 61 శాతం మేర తగ్గుతాయి. ఇథనాల్ ఆక్టేన్ నంబర్ RON 108+ ఉండటంతో ఇంజిన్ కంప్రెషన్ రేషియో, పవర్ పెరుగుతాయి. ఈ ఇంధనాన్ని ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. 2030-31 నాటికి దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ 26 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఈ బంక్‌లను తొలి దశలో ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె, ముంబై, నాగ్‌పూర్‌తో పాటు ప్రధాన నగరాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

సీఎన్‌జీ వాహనాలు

కాలుష్యాన్ని తగ్గించడం.. పర్యావరణాన్ని తగ్గించడంతో పాటు చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ, ఈవీలు, సీఎన్‌జీ వాహనాల వాడకం చూస్తుంటే.. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గిపోతుందనిపిస్తుంది. కానీ భారత్ లాంటి దేశంలో.. ఇది రాత్రికి రాత్రి సాధ్యం కాదు. ఇంకొన్నేళ్ల పాటు పెట్రోల్, డీజిల్ వాహనాలు మార్కెట్‌లో ఉంటాయి. కాకపోతే రాను రాను స్వచ్ఛమైన పెట్రోల్ వాడకం తగ్గిపోయి. అది పూర్తిగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌గా మారుతుంది.

Also read: స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా పవన్.. రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం హామీ!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×