E-Paper
Advertisement

AP Liquor Scam: ఎపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు కీలక నేతల అరెస్టుతో వైసీపీ గుండెల్లో రైళ్లు!

AP Liquor Scam: ఎపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు కీలక నేతల అరెస్టుతో వైసీపీ గుండెల్లో రైళ్లు!
Advertisement

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. వరుస సోదాలు నిర్వహిస్తూ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కేసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలను అరెస్ట్ చేసింది. సిట్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మరో ECIR నమోదు చేశారు. మద్యం రవాణా టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని, దాంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు 195కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు.

రాజ్ కేసిరెడ్డి నుంచి వివరాలు..

హైదరాబాద్‌తో పాటు మరో 15 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. ఇక రాజ్‌ కేసిరెడ్డి ఇంట్లో పలు ఎలక్ట్రానిక్ డివైస్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు మూడుసార్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ రాజ్ కేసిరెడ్డి నుంచి వివరాలు రాబట్టే పనిలో ఉంది. గతంలోనే 442 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా జరిపిన సోదాల్లో 195 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూర్చినట్లు గుర్తించారు.

Advertisement

Also read: Indian Sailors: ఒమన్‌ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి!

2019-2024 మధ్య..

మరోవైపు లిక్కర్ స్కాంలో తనను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఈడీ అరెస్ట్ చేసిందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ సోదాలపై కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ స్పందించారు. తన కంపెనీల లావాదేవీలపై అధికారులు విచారణ చేశారని చెప్పారు. 2019-2024 మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్‌ను అధికారులకు ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ఏపీ లిక్కర్‌కు సంబంధించి ఓ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుందని చెప్పిన కారుమూరి సునీల్ ఆ కంపెనీ నుంచి తమ కంపెనీకి లావాదేవీలు జరిగాయా అని ఈడీ అధికారులు ప్రశ్నించారన్నారు. తమకు ఈ లిక్కర్ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

తమ లబ్ధికోసం..

Advertisement

వైసీపీ హయాంలో రాష్ట్రంలో అమ్మాల్సిన మధ్యం బ్రాండ్ల పేర్ల ఎంపిక నుంచి స్కాం మొదలైందని ఆరోపణలున్నాయి. పేరు పొందిన బ్రాండ్ల లిక్కర్ ఆపేసి, తమకు లబ్ధి చేకూర్చే బ్రాండ్ల మధ్యమే విక్రయించేలా ప్రణాళిక రూపొందించారనే ఆరోపణలున్నాయి. అలా తమకు లబ్ధి చేకూర్చిన బ్రాండ్లకే అనుమతిచ్చారని రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి వంటి పేర్లు బయటకు వచ్చాయి. వీరితోపాటు అప్పటి సీఎంవో సెక్రటరీ ధనుంజయరెడ్డి, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఆనాటి బివరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌, బాలాజీ తదితరులపై కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం వీటన్నింటిపై విచారణ కొనసాగుతోంది.

Storey By: Appa Rao Big Tv

Also read: ఫ్యూచ‌ర్ సిటీపై హ‌రీశ్‌వి మ‌ళ్లీ అవే మాట‌లు! అమ‌రావ‌తిలా వివాద‌స్పదం చేసేందుకు బీఆరెస్ య‌త్నం!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×