E-Paper
Advertisement

ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..

ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..
Advertisement

కేసీఆర్ పాల‌న‌.. క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై తెలంగాణ ర‌క్ష‌ణ సేన (టీఆరెస్‌) చీఫ్ క‌విత మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. నేరేళ్లలో ద‌ళితుల‌పై ఆనాడు జ‌రిగిన పాశ‌విక దాడిని గురించి ప్ర‌స్తావిస్తూ ఆమె ప‌దేళ్ల పాల‌న‌ను పాపాల పాల‌న‌తో పోల్చారు. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించారు.

ఆనాడు త‌నూ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిని అయినందుకు సిగ్గుతో త‌లించుకుంటున్నాన‌న్న ఆమె.. బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ కోరారు. సిరిసిల్లా జిల్లా తంగెళ్ల‌ప‌ల్లి మండ‌లం నేరెళ్ల‌లో ఇటీవ‌ల మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబ స‌భ్యుల‌ను ఆమె ప‌రామ‌ర్శించారు. అనంత‌రం నేరెళ్ల బాధితుల‌ను కూడా ఆమె ప‌రామ‌ర్శించారు. అక్క‌డే వారితో క‌లిసి మీడియాతో కవిత మాట్లాడారు. కేటీఆర్‌, బండి సంజ‌య్‌, సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ ముగ్గురూ బాధిత కుటుంబాల‌కు న్యాయం చేయ‌లేక‌పోయార‌న్నారు.

Advertisement

కేటీఆర్ అధికారంలో ఉండి వారిని అండ‌గా నిల‌బ‌డ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించిన ఆమె.. పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ఆనాటి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, 8 మందిని ఐదు రోజుల పాటు విప‌రీతంగా కొట్టార‌ని, జైల‌ర్ కూడా వీరిని తీసుకోవడానికి అనుమ‌తించని విధంగా చిత‌క‌బాదార‌ని గుర్తు చేశారు.

మాన‌వ హ‌క్కుల క‌మిష‌న ఎస్పీపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఆదేశించినా.. ఓ ఎస్సైని బ‌లి చేసి చేతులు దులుపుకున్నార‌ని ఆనాటి పాల‌కుల రీతిని ఎండ‌గ‌ట్టారు క‌విత‌. బండి సంజ‌య్ కూడా ముస‌లి క‌న్నీరు కార్చి కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశాన‌ని అన్నారని, ఇంత వ‌ర‌కు ఆ రిపోర్టును బ‌య‌ట‌కు తీయ‌లేద‌న్నారు.

Advertisement

కేటీఆర్ ఈ బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉండాల‌ని, ఆర్థిక‌సాయం అందించాల‌ని, విద్యా, వైద్యానికి పూర్తిగా మ‌ద్ద‌తుగా నిల‌బ‌డాల‌ని క‌విత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధితుల‌కు ఒక్కొక్క‌రికి ఒక్కో కోటి చొప్పున ప‌రిహారం అందించాల‌ని కూడా ఆమె కోరారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ ఇష్యూను వ‌దిలేది లేద‌న్నారామె. బాధితులతో క‌లిసి ఢిల్లీకి వెళ్తామ‌ని, క‌మిష‌న్ రిపోర్టును బ‌య‌ట‌కు తీసి… బాధితుల‌కు న్యాయం జ‌రిగి.. నిందుతుల‌ను బ‌ట‌య‌కు లాగి వారికి శిక్ష ప‌డేదాకా వ‌ద‌ల‌బోమ‌న్నారు.

ప‌రామ‌ర్శించి వెళ్ల‌డానికి రాలేద‌ని, పోరాడి, ప్ర‌శ్నించి.. స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేదాకా వీరికి అండ‌గా ఉంటామ‌ని చెప్పేందుకే వ‌చ్చామ‌న్నారు. ర‌క్ష‌ణ సేనా అని పేరు పెట్టుకున్న‌ది ఇందుకేన‌న్నారు. తెలంగాణ స‌మాజాన్ని ర‌క్షించుకోవ‌డ‌మే ఈ టీఆరెస్ ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మ‌ని గుర్తు చేశారు క‌విత‌.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×