E-Paper
Advertisement

న్యూజెర్సీలో ఘోరం రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా మహిళ మృతి, ఘటన ఎలా జరిగింది?

న్యూజెర్సీలో ఘోరం రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా మహిళ మృతి, ఘటన ఎలా జరిగింది?
Advertisement

New Jersey Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదాల బారినపడి  భారతీయులు మృత్యువాత పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కనీసం నెలకు ఒకరు లేదా ఇద్దరు మరణిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.  తాజాగా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందారు.

న్యూజెర్సీలో ఘోరం రోడ్డు ప్రమాదం-అమెరికాలోని న్యూజెర్సీలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 44 ఏళ్ల మహిళ మృతి చెందారు. మృతురాలు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలానికి చెందిన శ్రీపతి దీపారెడ్డిగా గుర్తించారు. మాడుగుల మండల కేంద్రానికి చెందిన  పట్టాభి శేఖర్‌రెడ్డి-శశిరేఖ దంపతుల కూతురు దీపారెడ్డి.

Advertisement

రంగారెడ్డి జిల్లా మహిళ మృతి-రెండు దశాబ్దాల కిందట ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డితో ఆమె వివాహం అయ్యింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కావడం, అమెరికాలో ఉద్యోగం రావడంతో న్యూజెర్సీలో సెటిలయ్యారు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? సోమవారం న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద  దీపారెడ్డి కారు ఆగింది.

ఘటన ఎలా జరిగింది? వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన మరొక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ  ఘటనలో దీపారెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామకృష్ణారెడ్డి-దీపారెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంస్కృత, హర్షిత ఉన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.

Advertisement

ALSO READ:  అమ్మవారికి సమర్పించిన భక్తుడి వినతి పత్రం.. హృదయాన్ని హత్తుకునే లేఖ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×