E-Paper
Advertisement

టాటా నుంచి రెండు సూపర్ ఈవీలు.. సఫారీ, అవిన్యా రిలీజ్ ఎప్పుడంటే?

టాటా నుంచి రెండు సూపర్ ఈవీలు.. సఫారీ, అవిన్యా రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Tata Upcoming EV Cars in India: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ తన ఈవీ శ్రేణిని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లతో మార్కెట్లో సత్తా చాటుతున్న ఈ స్థానం, మరిన్ని కొత్త మోడళ్లను తీసుకురానుంది. ఇందులో ముఖ్యంగా టాటా సఫారీ EV, టాటా అవిన్యా EVపై వినియోగదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది. FY2031 నాటికి ఆరు కొత్త మోడళ్లను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఫేస్‌ లిఫ్ట్‌ లు, కొత్త వేరియంట్లు, పవర్‌ట్రెయిన్ అ ప్‌డేట్‌ లు, పూర్తిగా కొత్త మోడళ్లు ఉండనున్నాయి.  మొత్తం ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో సుమారు 30 శాతం ఈవీల వాటా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

టాటా సఫారీ EVని గురించి..

ఈ ప్రణాళికలో భాగంగా, 2026 దీపావళి సమయంలో టాటా సఫారీ EVని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిని ఇప్పటికే మార్కెట్లో ఉన్న హారియర్ EV ఆధారంగా రూపొందనుంది. Acti.ev+ ప్లాట్‌ ఫామ్‌పై నిర్మించే ఈ SUVలో హారియర్ EVలో ఉన్న సాంకేతికతనే ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉండొచ్చని తెలుస్తోంది. హారియర్ EV ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, సఫారీ పరిమాణం, బరువు ఎక్కువగా ఉండటంతో దాని రేంజ్‌లో స్వల్ప మార్పు ఉండే అవకాశం ఉంది.

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే.. సఫారీ EVలో ఆధునిక కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, OTA అప్‌డేట్లు, ADAS భద్రతా ఫీచర్లు, 540 డిగ్రీల కెమెరా వంటి సదుపాయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. బయట డిజైన్‌లో సీల్డ్ గ్రిల్, కొత్త బంపర్లు, రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ప్రత్యేక EV బ్యాడ్జింగ్ కనిపించే అవకాశం ఉంది. క్యాబిన్ డిజైన్ మాత్రం ప్రస్తుతం ఉన్న సఫారీ మాదిరిగానే ఉండి, కొన్ని ఈవీకి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఫీచర్లు అదనంగా అందించనున్నారు.

టాటా అవిన్యా ఈవీ గురించి..

ఆ తర్వాత 2027లో ప్రీమియం ఎలక్ట్రిక్ SUV అయిన టాటా అవిన్యా EVను విడుదల చేసే అవకాశం ఉంది. అవిన్యా EV ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై చిత్రాల ప్రకారం, కాన్సెప్ట్ మోడల్‌కు దగ్గరగా ఉండే డిజైన్‌తో  మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుభాగంలో క్లోజ్డ్ గ్రిల్, సన్నని LED డీఆర్‌ఎల్స్, నిలువుగా అమర్చిన లైటింగ్ యూనిట్లు, పెద్ద అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వాలుగా ఉండే రూఫ్‌లైన్ వంటి ఆధునిక డిజైన్ అంశాలు ఇందులో కనిపించనున్నాయి.

Advertisement

అవిన్యా EVలో 65kWh నుంచి 80kWh వరకు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌తో పాటు 350kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకునే సౌకర్యం వినియోగదారులకు అందుతుంది.  టాటా సఫారీ EV, అవిన్య EVలతో భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో మరింత పోటీ పెరగనుంది.

Read Also: కొనుగోలుదారులకు ఎంజీ షాక్.. కామెట్ ఈవీ ధరల పెంపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×