E-Paper
Advertisement

భారీ వర్షాల హెచ్చరిక.. ఐటీ కంపెనీలకు కీలక సూచన, అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు

భారీ వర్షాల హెచ్చరిక..  ఐటీ కంపెనీలకు కీలక సూచన,  అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
Advertisement

Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాల హెచ్చరిక- తెలంగాణ వ్యాప్తంగా జూలై 27 నుంచి ఆగష్టు ఒకటి వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.  దీనికితోడు హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షాలు పడ్డాయి.  ప్రస్తుతం వాతావరణ కూడా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలర్టయిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

Advertisement

ఐటీ కంపెనీలకు కీలక సూచన- సోమవారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. ఈ క్రమంలో వాహనాల రద్దీ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థల ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు.

అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు- ఈ విషయంలో కంపెనీలు లేదా సంస్థలు ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని సూచన చేశారు. అలాగే లోకేషన్, లాగౌట్ సమయాలను తమకు తెలియాలని తెలిపారు. దీనివల్ల ప్రయాణ సంబంధిత ప్రమాదాలను తగ్గించడమే కాదు రహదారి మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని తగ్గుతుందని తెలిపింది.

Advertisement

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిత్యావసర సేవలు సజావుగా సాగేందుకు తోడ్పడుతుందని తెలిపారు. వర్షాలు పడినా అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సలహా జారీ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. వర్షాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు సంస్థలు సహకరించాలని అందులో ప్రస్తావించారు. అవసరమైతే ప్రజలు కూడా  ప్రయాణాలు చేయాలని కోరారు.

ALSO READ: మీ దొంగ ప్రచారాలు, నాటకాలు ఆపండి.. మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్!

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×