E-Paper
Advertisement

బొద్దింక‌ల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా బీజేపీ మిత్రో… టీ బీజేపీ ..కోడిగుడ్డు మీద ఈక‌లు..!

బొద్దింక‌ల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా బీజేపీ మిత్రో… టీ బీజేపీ ..కోడిగుడ్డు మీద ఈక‌లు..!
Advertisement

జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద జెన్-జీ ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా మొన్న ఇందిరాపార్క్ వ‌ద్ద బీఆరెస్‌వీ చేప‌ట్టిన ఆందోళ‌న‌లో ఆక‌ర్షిత అనే ఓ అమ్మాయి మాట్లాడిన మాట‌ల‌ను మ‌నం చ‌ర్చించుకున్నాం. ఆమె మాట‌లు ఆక‌ట్టుకున్నాయి. అన్నింటికీ మించి ఆమె.. తాను బీఆరెస్ ప‌క్షం కాద‌ని, కేటీఆర్ కోసం రాలేద‌ని కూడా చెబుతూనే.. త‌మ ఫ్యామిలీ అంతా బీజేపీ స‌పోర్ట‌ర్సేన‌ని చెప్పుకొచ్చింది.

కానీ ఢిల్లీలో జెన్-జీ చేప‌డుతున్న విద్యార్థి ఉద్య‌మంపై కేంద్రం ద‌మ‌న‌కాండ త‌రువాత .. ఇక మోడీ లేడు బోడీ లేదు.. అని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కూడా చెప్పింది. మొన్న‌టి దాకా నిన్ను ఫాలో అయ్యాం.. ఇక‌పై నిన్ను వ‌ద‌లం.. ! అని కూడా ఆమె ఆ వేదిక‌గా వార్నింగ్ ఇచ్చింది. ఇది చ‌ర్చ‌కు వ‌చ్చింది.

Advertisement

అయితే చాలా మంది బీజేపీ సానుభూతి ప‌రులు… తెలంగాణ బీజేపీ నేత‌లు ఈ ఉద్య‌మం వెనుక అసాంఘీక శ‌క్తులు ఉన్నాయ‌ని ఆరోపిస్తూ వ‌చ్చారు. అంతా అయిన త‌రువాత కూడా.. అదే ధ‌ర్మేంద్ర రాజీనామా చేసిన త‌రువాత కూడా డీకే అరుణ చేసిన కామెంట్స్ వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. కాస్త ఆగండి.. దీని వెనుక ఎవ‌రెవ‌రున్నారో.. అంద‌రి విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.. అంద‌రి బాగోతాలు బ‌య‌ట పెడ‌తాం..అన్న‌ట్టుగా మాట్లాడారామె.

కానీ ఓ కొత్త విష‌యం మాత్రం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఉద్య‌మానికి బీజేపీ, దాని మిత్ర పార్టీల బృ0దం స‌భ్యులు, కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నార‌ని తేలింది. డేర్‌గా నేరుగా పాల్గొన‌డ‌మే కాదు.. ఏకంగా త‌మ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌పై త‌మ ఫోటోల‌తో పాటు నిర‌స‌న‌ల కామెంట్స్ కూడా బాజాప్తా పోస్ట్ చేశారు.

Advertisement

ఈ విష‌యాల‌ను ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు బ‌య‌ట‌పెడుతున్నారు. ఎవ‌రో అసాంఘీక శ‌క్తులు కాదు.. ఇదిగో చూడండి మీరు, మీ పార్టీ నేత‌లు, మీ పార్టీ మిత్ర బృందం.. పిల్ల‌లు.. ఇలా అంతా క‌లిసి పాల్గొన్నారు. కాక్రోచుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలిపారు… అని కొత్త విష‌యం బ‌య‌ట‌పెట్ట‌డంతో.. పాపం బీజేపీ నేత‌ల గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డ్డ‌ట్టైంది.

దీనికి ఏదో క‌ల‌రింగిచ్చి.. మోడీని కాపాడి.. మోడీ, అమిత్ షా ద్వ‌యం ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. దానికో అర్థం, ప‌ర‌మార్ధం ఉంటుంద‌నే విధంగా వెనుకేసుకు వ‌చ్చిన బీజేపీ సోష‌ల్ మీడియా కూడా ఇప్పుడు బిక్క‌ముఖ‌మేసింది. ఎవ‌రో అసాంఘీక శ‌క్తులు కాదు.. మీ మిత్ర ప‌క్ష శ‌క్తులే ఇక్క‌డ ఆందోళ‌న‌కు స‌పోర్టుగా ఉన్నాయి… అంటే ఇది ఏ రాజ‌కీయ పార్టీల‌కు మ‌ద్ద‌తుగా లేదు.. ఇందులో నిజాయితీ ఉంది.. విద్యార్ధుల భ‌విష్య‌త్తు కోసం వారు పోరాడుతున్న త‌ప‌న ఉంది.. అనే విధంగా ఒక్కొక్క‌రు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తూ వస్తున్నారు.

ఇంత జ‌రిగినా.. ఇంకా దీనిపై స‌మ‌ర్థించుకునే చ‌ర్య‌ల‌కే బీజేపీ దిగితే .. ఇక వీరిపైనా మాట‌ల దాడులు మొద‌ల‌య్యేలా ఉన్నాయి. అలా ఉంది మ‌రి ప‌రిస్థితి.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×