E-Paper
Advertisement

Toxic Movie: టాక్సిక్ వాయిదా యుద్ధం వల్ల కాదా..తెరపైకి అసలు నిజం!

Toxic Movie: టాక్సిక్ వాయిదా యుద్ధం వల్ల కాదా..తెరపైకి అసలు నిజం!
Advertisement

Toxic Movie: కేజీఎఫ్ 1,2 చిత్రాలతో పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకున్న కన్నడ హీరో యశ్ (Yash) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సినిమాల తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు విరామం ప్రకటించిన యశ్.. ఇప్పుడు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohandas) దర్శకత్వంలో ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఏకంగా 5 మంది హీరోయిన్లు నటిస్తూ ఉండడం గమనార్హం. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani) ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా నయనతార (Nayanthara), తారా సుతారియా (Tara Sutharia), హుమా ఖురేషి(Huma Qureshi) తోపాటు రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ను కూడా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఇక భారీ బడ్జెట్ తో వెంకట్ కె నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు గత ఏడాది అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

యుద్ధం కారణంగా టాక్సిక్ వాయిదా..

అయితే సడన్ గా ఈ సినిమాను వాయిదా వేశారు. దీనికి కారణం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఈ సినిమాను జూన్ 4వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు. కానీ అసలు నిజం మరొకటి ఉంది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు పశ్చిమాసియా యుద్ధం కారణం కాదా.. వేరే ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. చిత్ర బృందం యశ్ కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశారట. ఫైనల్ అవుట్ పుట్ చూసిన ఆయన సంతృప్తి చెందాడని.. కానీ వీఎఫ్ఎక్స్, నేపథ్య సంగీతం ఆయనను నిరాశపరిచాయని, అందుకే విడుదల తేదీని వాయిదా వేద్దామని కోరారట. పైగా సినిమాలోని లోటుపాట్లను సరిచేసి.. టైం తీసుకొని మరీ రిలీజ్ చేద్దామని యశ్ చెప్పడం వల్లే నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.

అసలు నిజం తెలిసి షాక్..

Advertisement

ఏదేమైనా ఇలాంటి అసలు నిజాన్ని బయట పెట్టకుండా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల సినిమా వాయిదా వేస్తున్నాం అనేది కేవలం సాకు మాత్రమేనని ఇప్పుడు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా అసలు నిజం బయటకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఎందుకంటే ఆచితూచి అడుగులు వేస్తూ అవుట్ పుట్ కచ్చితంగా, మరింత బలంగా తీర్చిదిద్దుతారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి ఫీస్ట్ అందిస్తారో చూడాలి..

ALSO READ:Film industry: ఆయన వల్లే 16 సినిమాలు కోల్పోయా.. నరకాన్ని అనుభవించలేకపోయాను.. వడివేలుపై నటి కామెంట్!

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్..

Advertisement

కన్నడ , ఇంగ్లీష్ భాషల్లో నేరుగా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ , హిందీ, మలయాళం భాషల్లో డబ్బింగ్ వర్షన్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోగా. జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది . ఏది ఏమైనా ఇక భారీ అంచనాల మధ్య అత్యాధునిక ప్రమాణాలతో.. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×