E-Paper
Advertisement

Kavitha: ఎంపీ అరవింద్‌కు కవిత వార్నింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం

Kavitha: ఎంపీ అరవింద్‌కు కవిత వార్నింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం
Advertisement

Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా కమీషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే ప్రతి జిల్లాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. దానికి సంబంధించిన పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తాను భావించడం లేదన్నారు.

ఎంపీ అరవింద్‌కు  తెలంగాణ జాగృతి చీఫ్ కవిత వార్నింగ్

Advertisement

గడిచిన రెండు సీజన్లలో కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పి దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టారని ఆరోపించారు. అదే సమయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకు  తెలియదన్నారు. ఒకరోజు ఒక మాట.. మరొక రోజు ఇంకో మాట ఆయన మాట్లాడుతారని అన్నారు.

ఆయన గురించి మాట్లాడి సమయం వృథా చేయదల్చుకోలేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి కలిగిన వారని అన్నారు. ఆయన మాటలు పురుష అహంకారానికి నిదర్శనమన్నారు. ఇలాంటి మాటలు మరోసారి మాట్లాడితే బాగోదని సూటిగా హెచ్చరించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ జాగృతి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కవిత.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం

జీహెచ్‌ఎంసీలో భారీగా అవినీతి జరుగుతోందన్నారు. నామినేషన్ పద్ధతిలో 1,148 కోట్ల రూపాయల పనులు అప్పజెప్పారని మండిపడ్డారు. టెండర్లు లేకుండా పనులు ఇవ్వడం తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్‌కు పూర్తి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో ఇలాగే చేసిందన్నారు.

2017 నుంచి దాదాపు 480 కోట్లు రూపాయల పనులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేషన్ ద్వారా కాంట్రాక్టులు ఇస్తోందని ఆరోపించారు. హెచ్‌ఎండీఏలో విజిలెన్స్, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్లలో నామినేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో 5 లక్షలు దాటిన పనులకు టెండర్లు పిలస్తున్నారని, నగరంలో వందల కోట్లు పనులను నామినేషన్‌ పద్దతిలో ఇస్తున్నారని అన్నారు.

ALSO READ: ఓ డీఎస్‌.. ఓ పొన్నాల‌.. ఓ కేకే తాజాగా జీవ‌న్ రెడ్డి.. గ‌తంలో సీనియ‌ర్ల ప‌రిస్థితుల‌ను గుర్తు చేస్తున్న కాంగ్రెస్‌ 

నగర అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ పరిధిలో వేల కోట్ల రూపాయల ఫ్లాట్లు అమ్మినా ఒక్క పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. చినుకుపడితే కార్లు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయని, ఇలాగైతే అభివృద్ధి ఎలా అని ప్రశ్నించారు.

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×