E-Paper
Advertisement

Nagarkurnool: సీఎం సొంత జిల్లాపై వరాల జల్లు.. నాగర్‌కర్నూల్‌కు కొత్త హంగులు.. రాజేష్ రెడ్డి క్లారిటీ!

Nagarkurnool: సీఎం సొంత జిల్లాపై వరాల జల్లు.. నాగర్‌కర్నూల్‌కు కొత్త హంగులు.. రాజేష్ రెడ్డి క్లారిటీ!
Advertisement

Nagarkurnool: స్వేచ్ఛ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపాలిటీలో ఛైర్మన్ తీగల సునేంద్ర అధ్యక్షుతన నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపాలిటీలో ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి రూ.56 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని అన్నారు. అలాగే డ్రైనేజీ పనులకు సంబంధించి రూ.40 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు.

12 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మాణం

Advertisement

రాజకీయ భేదాలు లేకుండా పట్టణ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో కూడా నాగర్ కర్నూల్ అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కేంద్రం కావడంతో నాగర్‌కర్నూల్ అభివృద్ధిపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు జిల్లా కేంద్రంలో 12 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

సీసీ రోడ్లన్నీ ఏడాదిలో పూర్తి చేస్తాం..

Advertisement

రెండేళ్లలో పెద్ద ఎత్తున సిసి రోడ్లను పూర్తి చేశామని, పెండింగ్ లో ఉన్న, కొత్త కాలనీల్లో సీసీ రోడ్లన్నీ రాబోయే ఏడాదిలో పూర్తి చేస్తామని అన్నారు. అన్ని వార్డుల్లో లో ఓల్టేజీ లేకుండా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ లైన్ల ఏర్పాటుతో పాటు ఎల్ఈడి విద్యుత్ బల్బులను కూడా అమర్చడం జరుగుతుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఎమ్మెల్యేకు వినతి పత్రం

మున్సిపల్ పాలకవర్గం పారదర్శకంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు కలిసి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే మీటింగ్ హాల్ నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు 22వ వార్డులో డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో కమీషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Also Read: ఛీ ఛీ.. అసలు వీడు తండ్రేనా.. కన్నకూతురిపై కన్నేసిన కామాంధుడు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×