// // అప్పులు ఇచ్చి ప్రాణాలు తీసే లోకల్ రౌడీలు... ఆటగాళ్లు ఇచ్చే -->
E-Paper
Advertisement

అప్పులు ఇచ్చి ప్రాణాలు తీసే లోకల్ రౌడీలు… ఆటగాళ్లు ఇచ్చే ఝలక్ అదుర్స్

అప్పులు ఇచ్చి ప్రాణాలు తీసే లోకల్ రౌడీలు… ఆటగాళ్లు ఇచ్చే ఝలక్ అదుర్స్
Advertisement

Malayalam Action Drama: కబడ్డీ ప్లేయర్స్ సత్తా ఏంటో ఆటలో తెలుస్తుంది. కానీ వాళ్ళతోనే ఎవరైనా ఆడుకోవాలి అనుకుంటే ? విలన్ల ఆటను ఆ ఆటగాళ్లు ఎలా కట్టించారు ? ఆనంది తెలియాలంటే… 2025లో విడుదలై మలయాళ సినిమా ప్రేమికులను ఆకట్టుకున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘Balti’ని చూడాల్సిందే. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ కేరళ – తమిళనాడు సరిహద్దుల్లోని వేలంపాలయం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ అందరికీ కబడ్డీ అంటే ప్రాణం. ఉదయన్ మన హీరో పేరు. ఈ యువకుడు గ్రామంలోనే మోస్ట్ టాలెంటెడ్ కబడ్డీ ఆటగాడు. అతనికి ‘బాల్తీ’ అని నిక్ నేమ్ ఉంటుంది. ఉదయన్, అతని ముగ్గురు బాల్య స్నేహితులు కలిసి ‘పాంజమి రైడర్స్’ అనే టీమ్‌గా ఏర్పడి స్థానిక టోర్నమెంట్లలో ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తూ గ్రామ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తారు.

Advertisement

వీళ్ళ మధ్య ఉన్న స్నేహం అన్నదమ్ముల బంధం కంటే ఎక్కువ. ఒక ప్రతిష్టాత్మక కబడ్డీ టోర్నమెంట్‌లో పాంజమి రైడర్స్ లోకల్ మాఫియాకు సంబంధించిన టీమ్‌ ను ఘోరంగా ఓడిస్తారు. ఈ విజయం వారి జీవితాల్లో ఊహించని తుఫానును తెస్తుంది. మాఫియా లీడర్ ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక ఉదయన్ గ్రూప్‌పై పగ పెంచుకుంటాడు. క్రమంగా ఉదయన్, అతని స్నేహితులు అండర్‌వరల్డ్ క్రైమ్, అక్రమ ఫైనాన్స్, గ్యాంగ్ వార్ల వలయంలో చిక్కుకుపోతారు.

ఈ గ్యాప్ లో ఉదయన్ జీవితంలోకి ప్రీతి అస్రానీ పాత్ర రూపంలో ప్రేమ ఎంట్రీ ఇస్తుంది. కానీ మాఫియా ఒత్తిళ్లు, డబ్బు ఆశలు, భయం వల్ల ఒకప్పటి ప్రాణ స్నేహితుల మధ్య విభేదాలు, నమ్మక ద్రోహాలు మొదలవుతాయి. ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే స్థాయికి కథ చేరుకుంటుంది. ఈ పరిస్థితుల మధ్య ఉదయన్ ఒంటరిగా మిగిలిపోతాడు. మరి ఉదయన్ ఆ మాఫియాకు ఎలా బుద్ధి చెప్పాడు ? ఆ మాఫియా అతన్ని పెట్టిన ఇబ్బందులు ఏంటి ? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు ? చివరికి హీరో హీరోయిన్ ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ?

Advertisement

‘బాల్టి’ సినిమా స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే పొరబడినట్టే. ఎంత బలమైనదో, ఒక్క తప్పు ఎలా జీవితాలను మార్చేస్తుందో, అధికారం, డబ్బు ముందు మనుషులు ఎంత క్రూరంగా మారగలరో చూపించే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. కబడ్డీ మ్యాచ్ సీన్స్ చాలా ఎనర్జీగా, రియలిస్టిక్‌గా ఉంటాయి. జూలై 10 నుండి Sony LIVలో అందుబాటులోకి వచ్చింది ఈ మూవీ. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఉండే చిన్న గ్రామం వేలంపాలయంలో సాగే ఈ చిత్రం కబడ్డీ ఆట, లోకల్ మాఫియా మధ్య సాగే ఇంట్రస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్.

Read Also: మిస్టీరియస్ జంతువులను పరిగెత్తించి కొట్టే స్కూల్ పిల్లలు… కొరియన్ యాక్షన్ ప్యాక్డ్ మాస్టర్ పీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×