E-Paper
Advertisement

JSW Jetour T2 i-DM: పెట్రోల్ లేకున్నా 130కిమి నడిచే కారు.. ఇండియాలోనే అత్యంత తక్కువ ధర హైబ్రిడ్ SUV

JSW Jetour T2 i-DM: పెట్రోల్ లేకున్నా 130కిమి నడిచే కారు.. ఇండియాలోనే అత్యంత తక్కువ ధర హైబ్రిడ్ SUV
Advertisement

JSW Jetour T2 i-DM| భారతదేశం ఆటో రంగంలో JSW (జేఎస్‌డబ్యూ) గ్రూప్ స్వతంత్రంగా కార్ల వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం చైనా కంపెనీ చెరీ ఆటోమొబైల్‌తో భాగస్వామ్యం చేసింది. జేఎస్‌డబ్యూ కంపెనీ ఇండియాలో ఇప్పటికే MG మోటార్ ఇండియాతో ఉన్న భాగస్వామ్యం ఉంది. అయినా వేరుగా చైనా కంపెనీ చెరీ ఆటోమొబైల్‌తో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. భారత ప్యాసెంజర్ వాహనాల మార్కెట్‌లో తనదైన బ్రాండ్ గుర్తింపు సృష్టించాలని JSW లక్ష్యంగా పెట్టుకుంది.

దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ SUV లాంచ్ చేసిన JSW

భారతదేశంలో జేఎస్‌డబ్యూ మొదట తీసుకొస్తున్న కారు జెటౌర్ T2 i-DM SUV అవుతుంది. జెటౌర్ అనేది చెరీ ఆటోమొబైల్ యాజమాన్యంలోని ప్రీమియం SUV బ్రాండ్. ఈ SUVను భారతదేశంలో కొత్త జేఎస్‌డబ్యూ బ్రాండ్ పేరుతో అమ్ముతారు. పెట్రోల్ మాత్రమే వెర్షన్ కాకుండా, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్ మాత్రమే తీసుకొస్తారు.

ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీపై దృష్టి

Advertisement

జెటౌర్ T2 i-DM పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండింటినీ కలిపి పనిచేస్తుంది. ఇది ఇంధన వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గిస్తుంది. జేఎస్‌డబ్యూ కంపెనీ ఆటో రంగంలో ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత ఇమేజ్ సృష్టించడానికి PHEVని ఎంచుకుంది. లగ్జరీ బ్రాండ్లు తప్ప మెయిన్‌స్ట్రీమ్ మార్కెట్‌లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి.

దేశంలోనే అతి తక్కువ ధరలో హైబ్రిడ్ SUV

ఈ SUV భారతదేశంలో సుమారు రూ.45 లక్షల ధరలో ఉండవచ్చు. ఈ ధరలో ఇండియాలో ఇదే అతి చవకైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అవుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు ఏ మెయిన్‌స్ట్రీమ్ బ్రాండ్ కూడా PHEV (ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలెక్ట్రిక్ వాహనం) ఆఫర్ చేయలేదు. ఈ ధరతో జేఎస్‌డబ్యూ భారత SUV మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించవచ్చు.

డిజైన్, బాడీ స్ట్రక్చర్

Advertisement

జెటౌర్ T2 i-DM బోల్డ్, బాక్సీ SUV డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను పోలి ఉంటుంది. ల్యాడర్ ఫ్రేమ్ బదులు బలమైన మోనోకాక్ చాసిస్ ఉపయోగించారు. ఐదుగురు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సీటింగ్ లేఅవుట్ ఉంది.

డైమెన్షన్స్, రోడ్ ప్రెజెన్స్

ఈ SUV పొడవు 4,785 mm, వెడల్పు 2,006 mm, ఎత్తు 1,875 mm. వీల్‌బేస్ 2,800 mm ఉంది. ఈ పరిమాణాల వల్ల రోడ్డు మీద బలమైన ఉనికి కనిపిస్తుంది.

పవర్‌ట్రైన్, పర్‌ఫామెన్స్

1.5 లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగిస్తుంది. ఇది 156 PS పవర్, 220 Nm టార్క్ ఇస్తుంది. మూడు స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఇది ఎలక్ట్రిక్, ఇంజిన్ మోడ్‌ల మధ్య సాఫీగా మారిపోతుంది.

ఎలక్ట్రిక్ రేంజ్, ఛార్జింగ్

26.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. NEDC స్టాండర్డ్ ప్రకారం.. 130 కి.మీ. వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణం చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 30 నుంచి 80 శాతం వరకు త్వరగా ఛార్జ్ అవుతుంది. ఇది రోజువారీ సిటీ డ్రైవింగ్‌ను చవకగా, సమర్థవంతంగా చేస్తుంది.

డ్రైవ్ ఆప్షన్లు, గ్లోబల్ అందుబాటు

అంతర్జాతీయ మార్కెట్లలో ఫ్రంట్-వీల్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఉన్నాయి. భారత రోడ్లు, డిమాండ్ ఆధారంగా జేఎస్‌డబ్యూ వేరియంట్లను ఎంచుకుంటుంది. భారతదేశానికి సంబంధించిన ఫైనల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

మాన్యుఫాక్చరింగ్, లోకల్ అసెంబ్లీ

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌లో ఈ SUVను లోకల్‌గా అసెంబుల్ చేస్తారు. ఇది జేఎస్‌డబ్యూ దీర్ఘకాలిక ఆటోమోటివ్ ప్లాన్‌లకు సహాయపడుతుంది. లోకల్ అసెంబ్లీ వల్ల ఖర్చులు తగ్గుతాయి, సప్లై సమర్థవంతంగా ఉంటుంది.

Also Read: చంద్రుడిపై లగ్జరీ హోటల్ నిర్మాణం.. ఒక రాత్రి గడపడానికి కోట్లలో రెంట్

లాంచ్ టైమ్‌లైన్, వ్యూహం

2026 ఫెస్టివ్ సీజన్‌లో ఈ SUV లాంచ్ కావచ్చు. JSW MG మోటార్ ఇండియా కార్లతో ఓవర్‌లాప్ రాకుండా చూస్తారు. రెండు బ్రాండ్లు వేర్వేరు కస్టమర్లను టార్గెట్ చేస్తాయి. ఇది రెండు వ్యాపారాలను లాభదాయకంగా, ఫోకస్‌గా ఉంచుతుంది.

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×