// // Today Horoscope in Telugu: - రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం - వారు చేపట్టిన పనుల్లో విజయం -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  మే 12వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించినవి కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

వృషభం

Advertisement

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది. 

మిథునం

దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. 

కర్కాటకం

Advertisement

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. 

కన్య

దూరప్రయాణ సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. 

ధనుస్సు

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.  

మకరం

ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. 

కుంభం

కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

మీనం

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×