// // Today Horoscope in Telugu: - ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం - వారికి అనుకోని లాభాలు -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి అనుకోని లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి అనుకోని లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 17వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు. ఆదాయం తగ్గి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.  బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. 

వృషభం

Advertisement

ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.  చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. 

మిథునం

మిత్రులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు.

కర్కాటకం

Advertisement

వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.  చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.

సింహం

బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కన్య

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో  ఆటంకాలు ఉంటాయి.  మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపార నిర్వహణలో లోపాలు అదిగమిస్తారు. సోదరుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి.  ఇంటా బయట చిత్రమైన  సంఘటనలు చోటుచేసుకుంటాయి.

వృశ్చికం

నిరుద్యోగుల శ్రమ ఫలించదు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. దూరప్రయాణాలు వలన శ్రమధిక్యత పెరుగుతుంది. 

ధనుస్సు

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన విషయాలు పై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

మకరం

నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. 

కుంభం

ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  నూతన పనులకు శ్రీకారం చూడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. దీర్ఘ కాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి.

మీనం

వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.  స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి.  నిరుద్యోగులకు చాలకాలంగా వేచిచూస్తున్న అవకాశములు అందుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×