E-Paper
Advertisement

Sarpanch Elections: తెలంగాణ పల్లెపోరులో చివరి అంకం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

Sarpanch Elections: తెలంగాణ పల్లెపోరులో చివరి అంకం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
Advertisement

Sarpanch Elections: తెలంగాణలో మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం పోలింగ్‌ ముగియగానే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తి కాగానే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన వారిలో విజేతలను ప్రకటించనున్నారు. ఇవాళే ఉప సర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల వాయిదా పడితే రేపు ఆ ఎన్నికను నిర్వహించనున్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు.. స్వతంత్రుల ప్రచారాలతో ఇన్నిరోజులు పల్లె హోరెత్తిపోయింది. తమను అభ్యర్థులుగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ హామీల వర్షం కురిపించారు. గెలిస్తే తాము చేయబోయే పనులు అన్నింటిని పాంప్లెట్స్ పై ప్రింట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఇప్పుడు గెలుపు ఎవర్ని వరిస్తుందో చూడాలి.

Advertisement

మూడో విడతలో మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విడతలో 4,157 గ్రామాలకు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 గ్రామాలు, 7916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3,752 గ్రామ పంచాయతీల్లో 12,640 మంది సర్పంచ్ అభ్యర్థుల పోటీ పడుతున్నారు. కాగా, 11 గ్రామాలకు,112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు.

Also Read: ఆర్ఎఫ్‌సీఎల్ ఉత్పత్తిలో తెలంగాణకు 70% వాటా ఇవ్వాల్సిందే: మంత్రులు

Advertisement

ఇక తుది విడత పోరుకు అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది సిద్దమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ బందోబస్తు కల్పించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పించారు పోలీసులు. మూడో విడుతలో 3,752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఈ విడుతలో అధికార కాంగ్రెస్ హవా కొనసాగిస్తుందా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధిస్తుందా, లేక బీజేపీ పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×