E-Paper
Advertisement

Tirumala: కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఎంతుందంటే..?

Tirumala: కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఎంతుందంటే..?
Advertisement

Tirumala: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది నిందితులను సిట్‌ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

అయితే వైవీ సుబ్బారెడ్డి అతని పదవి కాలంలోనే అనుభవం లేని డెయిరీలకు ఆర్డర్లు ఇచ్చి, కల్తీ నెయ్యి సరఫరా అనుమతించినట్లు SIT నిర్ధారించింది. 2022 మే 25న భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లో కలిసి, కేజీ నెయ్యికి రూ.25 లబ్ధి, తనిఖీలు ఆపమని కోరారు. కల్తీ తేలినా, సరఫరాదారులపై చర్యలు సిఫార్సు చేయకపోవడం అనుమానాస్పదం.

Advertisement

అయితే సుబ్బారెడ్డి పీఏ చిన అప్పన్న ఖాతాలో 4.69 కోట్లు, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి రూ.50 లక్షల ముడుపులు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దిల్లీలో అమన్ గుప్త నుంచి రూ.20 లక్షలు, విజయ్ గుప్త నుంచి రూ.30 లక్షలు చిన అప్పన్నకు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. సుబ్బారెడ్డి, అతని సతీమణి యర్రం స్వర్ణలతారెడ్డి బ్యాంక్ లావాదేవీలు SIT స్కానర్‌లో ఉన్నాయి.

Also Read: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. నేడు బంగారం ధర ఎంతుందంటే?

Advertisement

అతను ఈ నెల 13న విచారణకు రావాలని సుబ్బారెడ్డికి నోటీసులు ఇవ్వగా.. అనారోగ్య కారణాల రీత్యా తాను విచారణకు రాలేనని సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 20న హైదరాబాద్‌లోని సుబ్బారెడ్డి నివాసంలో విచారణ చేస్తామని సిట్ అధికారులు తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పే విషయాలు కల్తీ లడ్డూ కేసుకు కీలకంగా మారనున్నాయి. ఈ నెల 20న హైదరాబాద్‌లో విచారణ జరగనుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×