E-Paper
Advertisement

YSRCP : ఏ ఒక్కరినీ వదలం.. పిన్నెల్లికి అంత సీన్ ఉందా?

YSRCP : ఏ ఒక్కరినీ వదలం.. పిన్నెల్లికి అంత సీన్ ఉందా?
Advertisement

వైసీపీ నేతల తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని వారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల మొదలు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, గల్లీ స్థాయి లీడర్ సైతం ఎవరి మాట వినేదే లేదని, తగ్గేదెలే అంటూ అరాచకాలకు పాల్పడ్డారు. కబ్జాలు, రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గతంలో వారిపై నమోదైన కేసుల ఆధారంగా కూటమి సర్కార్ వారి లెక్కలను సరిచేస్తున్నది. ఇప్పటికే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చాలా మందే జైలు జీవితం గడుపుతున్నారు.ఈ క్రమంలోనే 99 రోజుల పాటు జైలు జీవనం గడిపి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బయటకు రాగానే కూటమి సర్కారుకు వార్నింగ్ ఇవ్వడం మొదలెట్టారు.

హత్యారోపణలు..

జంట హత్యల కేసులో పిన్నెల్లి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే కూటమి సర్కార్ ఆయన్ను జైలుకు పంపించగా.. గురజాల కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు వద్ద పిన్నెల్లి అనుచరులు భారీ సంఖ్యలో రాగా, అక్కడ హంగామా చేసినట్టు సమాచారం. అయితే, బయటకు వచ్చిన పిన్నెల్లి మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ తనమీద కక్షతోనే అక్రమ కేసులు బనాయించి జైలు పంపించిందని అన్నారు.వెల్దుర్తి మండలంలో టీడీపీ వర్గాల మధ్య జరిగిన హత్యలతో తనకు సంబంధం లేదని, నాటిఎస్పీ సైతం ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణ వలన జరిగిందని చెప్పినా.. అదేమీ పట్టించుకోకుండా తనను మానసిక క్షోభకు గురిచేశారని ఆయన ఆరోపించారు.

ఎవ్వరినీ వదలం..

Advertisement

99 రోజుల పాటు తనను జైలులో పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వారిని రాబోయే రోజుల్లో చట్టం ముందు నిలబెడతానని, ఎవ్వరినీ వదిలేది లేదని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. దీని వెనుక ఉన్న పొలిటికల్ లీడర్స్, అధికారులనూ వదిలేది లేదని స్పష్టంచేశారు.ఇదిలాఉండగా, గతేడాది మే నెలలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీకి చెందిన సోదరులు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు హత్యకు గురయ్యారు.ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆరో నిందితుడిగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. విచారణ అనంతరం ఆయన్ను కోర్టు హాజరుపరచగా జైలు శిక్ష ఖరారు అయ్యింది. తాజాగా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు.

KCR : సారు అసెంబ్లీకి వస్తారా? ఎత్తిన జీతం తిరిగిచ్చేస్తారా?

Advertisement

ఇదిలాఉండగా, పిన్నెల్లి రామకృష్ణరావుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నేరుగా జగన్ ఆదేశాల మేరకు ఆయన కొన్ని వ్యవహారాలు చక్కదిద్దినట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్యల వెనుక మాత్రం ఆయన ఉన్నారని జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో స్థానికంగా అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని పిన్నెల్లిని కోర్టులో హాజరుపరిచారు. అయితే, తాను జైలు జీవనం గడపడానికి కూటమి సర్కారే కారణమని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కరి లెక్కులు తేలుస్తామని పిన్నెల్లి వార్నింగ్ ఇవ్వడంపై కూటమి, తెలుగుదేశం పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జైలు జీవితం గడిపినా ఆయకు బుద్ధిరాలేదని విమర్శలు చేస్తున్నారు. అసలు ఆయన సీఎం అనుకుంటున్నాడా? మాజీ ఎమ్మెల్యేకు అంత సీన్ ఉందా? ఉంటే మరోసారి నియోజకవర్గంలో గెలిచి చూపించాలని తెలుగుతమ్ముళ్లు సవాల్ విసిరారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×