E-Paper
Advertisement

MLC Jayamangala VenkataRamana : ఎమ్మెల్సీ మూడో పెళ్లికి.. సాక్షిగా రెండో భార్య!

MLC Jayamangala VenkataRamana | ఆంధ్ర ప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జయమంగళ వెంకట రమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవి శాఖలో ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుజాతను సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నారు.

MLC Jayamangala VenkataRamana : ఎమ్మెల్సీ మూడో పెళ్లికి.. సాక్షిగా రెండో భార్య!
Advertisement
andhra news updates

MLC Jayamangala VenkataRamana News(Andhra news updates):

ఆంధ్ర ప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జయమంగళ వెంకట రమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవి శాఖలో ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుజాతను సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నారు.

కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోమవారం ఉదయం ఈ వివాహం జరిగింది. కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌ దుర్గా రాణి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని నూతన దంపతులకు అందజేశారు. ఈ వివాహంలో విశేషమేమిటంటే.. ఎమ్మెల్సీ జయ మంగళ రెండో భార్య సునీత ఈ వివాహానికి సాక్షి సంతకం చేశారు. సునీత, వెంకటరమణల కుమారుడు కూడా ఈ వివాహానికి వచ్చాడు. ఒక ఎమ్మల్సీ మూడో పెళ్లికి అతని రెండో భార్య సాక్షిగా సంతకం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

ఎమ్మెల్సీ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన సునీతను రెండో వివాహం చేసుకున్నారు. వెంకటరమణ, సునీతకు ఒక కొడుకు, ఒక కుమార్తె సంతానం. ఆ తరువాత కుటుంబ కలహాల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఫారెస్ట్ ఆఫీసర్ సుజాతకు కూడా ఇంతకుముందు వివాహం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఎమ్మెల్సీ వెంకటరమణ తాజాగా సుజాతను మూడో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×