E-Paper
Advertisement

AP Politics: వైసీపీకి కలిసిరాని 2025.. పార్టీ ఇమేజ్ ఫుల్ డ్యామేజ్, చివర్లో రప్పా రప్పా కూడా

AP Politics: వైసీపీకి కలిసిరాని 2025.. పార్టీ ఇమేజ్ ఫుల్ డ్యామేజ్, చివర్లో రప్పా రప్పా కూడా
Advertisement

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పరిస్థితి ఏంటి? 2025 ఏడాది ఆ పార్టీకి కలిసి రాలేదా? వైసీపీ  ఏ అస్త్రాలు ఎక్కుపెట్టినా రివర్స్ అవుతున్నాయా? బైపోల్ మొదలు జగన్ పుట్టినరోజు వరకు జరిగిన వ్యవహారాలు ఆ పార్టీని డ్యామేజ్ చేశాయా? దీన్ని నుంచి బయటపడేందుకు వైసీపీ తీవ ప్రయత్నాలు చేస్తోందా? సోషల్‌మీడియా ప్రబలంగా ఉన్న ఈ రోజుల్లో అధినేత ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఇదే కంటిన్యూ అయితే ఇబ్బందులు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వైసీపీకి కలిసిరాని 2025 ఏడాది

Advertisement

2025 ఏడాది వైసీపీకి ఏమాత్రం కలిసి రాలేదు. ప్రత్యర్థులపైకి ఆ పార్టీ ఎక్కుపెట్టిన అస్త్రాలు బూమరాంగ్ అయ్యాయి. క్లిక్ అయినట్టే కనిపించి.. చివరకు రివర్స్ అయ్యాయి. ఆ పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉన్నారా? విపక్షంలో ఉన్నప్పుడే ఇలా ఉంటే.. అధికారంలోకి వస్తే వారి ఆగడాలకు అంతు ఉండదని చర్చించుకోవడం మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు కొద్దిరోజులు సైలెంట్‌గా ఉండడమే బెటరనే వాదన మొదలైంది.

బైపోల్ ఎన్నికలు, తిరుమల లడ్డూ, పరకామణి వ్యవహారం, మెడికల్ కాలేజీ పీపీపీ పద్దతి, చివరకు జగన్ పుట్టినరోజు కార్యకర్తల వ్యవహారం..  వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. జగన్ పుట్టినరోజు కార్యకర్తల వీరాభిమాని ఆ పార్టీకి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది.  పొట్టేళ్లను పబ్లిక్‌గా నరికి, జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేయడం, ఆ సమయంలో జరిగిన పరిణామాలు వైసీపీకి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది.

Advertisement

బైపోల్ మొదలు జగన్ పుట్టినరోజు వరకు

వైపీసీ హార్డ్‌కోర్ కార్యకర్తలను అరెస్టు చేసి నడిరోడ్డులో తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అంతకుముందు టీడీపీ నేతలను వారు తిట్టి పోసిన వీడియోలు చక్కర్లు కొట్టాయి.  దీన్ని నుంచి తేరుకునేందుకు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీడియా ముందుకొచ్చి నేతలు మాట్లాడినా ఫలితం లేకపోయింది.

జగన్ పుట్టినరోజు వ్యవహారం ఇలా జరగడంపై నేతలు లోలోపల మదనపడుతున్నారు. కార్యకర్తలను అధినేత సముదాయించే ప్రయత్నం చేయలేదని అనుకుంటున్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లోకి వెళ్లడానికి కాస్త ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. దీనికితోడు టీటీడీ లడ్డూ వ్యవహారం, పరకామణి వంటి ఘటనలు పార్టీని మరింత దిగజార్చినట్టు చర్చించుకుంటున్నారు.

ALSO READ:  రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్, 35 రోజుల్లోనే శ్రీకారం

ఇక మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మించడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది.  వైసీపీ ఎన్నిచెప్పినా ప్రజలు నమ్మడం లేదని అంటున్నారు.  ఆసుపత్రులు కట్టడం వల్ల ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయని అంటున్నారు. జిల్లాలను వైసీపీ విభజించినా, ఎలాంటి  సౌకర్యాలు లేవని గుర్తు చేస్తున్నారు. దీనిపై పలువురు కేంద్రమంత్రులు స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో వైసీపీ అస్త్రాలు రివర్స్ అయ్యాయని వాదన ఆ పార్టీలో లేకపోలేదు. ఎలా చూసినా 2025లో వైసీపీ ఏ మాత్రం ప్రజల మద్దతు పొందలేకపోయిందని అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×