// // Ex MP Gorantla Madhav: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
Advertisement

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్ తగిలింది. పోక్సో కేసులో కోర్టుకు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బయటపెట్టారన్న ఆరోపణలతో గోరంట్ల మాధవ్ పై గతంలో పోక్సో కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణకు హాజరవ్వాలని మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో విజయవాడలోని పోక్సో కోర్టు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

నోటీసులు ఇచ్చినా

రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో గోరంట్లపై పోక్సో కేసు నమోదైంది. అత్యాచారానికి గురైన బాలికకు వివరాలను బహిరంగంగా వెల్లడించడం పోక్సో చట్టానికి విరుద్ధమని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అంశంలో కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మాధవ్ విచారణకు హాజరు కాకపోవడంతో.. తాజాగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టులో పిటిషన్

Advertisement

పోక్సో కోర్టు తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. గోరంట్ల సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

Also Read:  గోరంట్ల మాధవ్‌కు భారీ షాక్.. పోలీసులు మరోసారి నోటీసులు 

బీఎన్ఎస్, పోక్సో సెక్షన్లు

Advertisement

వాసిరెడ్డి పద్మ తన ఫిర్యాదులో.. గోరంట్ల మాధవన్ ఆన్ లైన్ లో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించారని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారికి, ముఖ్యంగా మైనర్లకు, వారి గుర్తింపును బయటపెట్టకుండా చట్టబద్ధమైన రక్షణ ఉందన్నారు.అయితే గోరంట్ల మాధవ్ బాధిత మైనర్ల వివరాలను బహిర్గతం చేసి చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక బాధితుల సమాచారాన్ని బయటపెట్టడం బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 72, 79, పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం నేరమని పద్మ తన ఫిర్యాదులో తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×