E-Paper
Advertisement

Gorantla Madhav: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే.. ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం: గోరంట్ల మాధవ్

Gorantla Madhav: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే.. ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం: గోరంట్ల మాధవ్
Advertisement

Gorantla Madhav: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద‌గ్గర ఏ గిఫ్టు తీసుకుని రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ప‌క్కన‌పెట్టారో ప్రజ‌ల‌కు స్పష్టం చేయాల‌ని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ డిమాండ్ చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శనివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు త‌న స్వార్థ ప్రయోజ‌నాల కోసం రాష్ట్ర ప్రగతిని తాక‌ట్టుపెట్టడం అల‌వాటుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

రాయలసీమ లిఫ్ట్ ఆపింది అందుకే

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ప‌దేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజ‌ధానిగా ఉన్నా హ‌క్కులు వ‌దిలేసుకుని చంద్రబాబు విజ‌య‌వాడ‌కు పారిపోయి వ‌చ్చారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఇప్పుడు ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును ఆపేశారని విమ‌ర్శంచారు. చంద్రబాబుతో మాట్లాడి రాయ‌ల‌సీమ లిఫ్టును తానే ఆపేయించాన‌ని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. దానిపై నిజ‌నిర్ధార‌ణ‌కు కూడా సిద్ధమ‌ని ప్రక‌టించ‌డం చూస్తే ఎన్నో అనుమానాల‌కు తావిస్తోంద‌ని వివ‌రించారు.

రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం

Advertisement

ఏపీ ప్రయోజ‌నాల‌ను కూడా తాక‌ట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ ర‌హ‌స్య ఒప్పందం ఏమిటో చంద్రబాబు ఏపీ ప్రజ‌ల ముందు బ‌హిరంగ‌ప‌ర‌చాల‌ని డిమాండ్ చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ కి మంచి పేరు రావ‌డం ఓర్వలేకనే చంద్రబాబు రాయ‌ల‌సీమ లిఫ్టును ప‌ణంగా పెట్టడానికి కూడా వెనుకాడ‌టం లేద‌ని గోరంట్ల మాధ‌వ్ ఆరోపించారు.

Also Read: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

ప్రశ్నించినందుకే అక్రమ కేసులు

Advertisement

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల‌పై జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించినందుకే తనపై అక్రమంగా కేసు నమోదు చేసి, వారెంట్ జారీ చేశారని పేర్కొన్నారు. చిన్నారిని చంపేసి ఏడాదిన్నర గ‌డిచినా ఇంత‌వ‌ర‌కు మృత‌దేహాన్ని గుర్తించి నిందితుల‌ను శిక్షించ‌లేని కూట‌మి ప్రభుత్వం.. అన్యాయాల‌ను ప్రశ్నిస్తున్న వైసీపీ నాయ‌కుల‌పై మాత్రం అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతుల‌ను నొక్కాల‌ని చూస్తుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాల‌పై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవ‌హ‌రించాల‌ని గోరంట్ల మాధ‌వ్ సూచించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×