E-Paper
Advertisement

YSRCP : ఏపీలో అలజడికి ‘అంబటి’ ప్లాన్..!

YSRCP : ఏపీలో అలజడికి ‘అంబటి’ ప్లాన్..!
Advertisement

ఏపీలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతలు అశాంతి, అలజడులను సృష్టించాలని ప్లాన్ చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు సైతం అందించినట్టు సమాచారం. అందులో భాగంగా మరోసారి తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని ఉపయోగించారని.. సీబీఐ కోర్టుకు అందజేసిన రిపోర్టును ప్రజల ముందు పెట్టి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ నెయ్యి, జంతువుల అవశేషాల నుంచి తయారైన నెయ్యిని వినియోగించలేదని వైసీపీ చెబుతోంది. కావాలనే నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నాటి ప్రభుత్వం మీద విషప్రచారం చేశారని.. అందుకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

సిట్ నివేదిక మరోలా..

రాష్ట్ర ప్రభుత్వం వేసిన ‘సిట్’ మాత్రం ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో కెమికల్స్ మిక్స్, జంతుఅవశేషాలు సైతం కనిపించినట్టు పేర్కొన్నట్టు కూటమి నేతలు చెబుతున్నారు. ఈ మేరకు జగన్ హయాంలో హిందూవుల సంప్రదాయాలు, తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను జగన్ అండ్ కో ఎలా దెబ్బతీసిందో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి మరి ప్రదర్శిస్తున్నారు. ఇది కాస్త వైసీపీ, కూటమి నేతల మధ్య పెనువివాదానికి దారితీసింది. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకోని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాష్ట్రంలో అలజడులకు కుట్ర చేసినట్టు తెలుస్తున్నది.

గుంటూరు రణరంగం..

Advertisement

గుంటూరు జిల్లాలో ఓ చోట టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే ఆయన ఫ్లెక్సీని మీరు తీసేస్తారా? లేదా నన్నే తీసేయమంటారా? అని సవాల్ విసిరారని… అనంతరం ఆ ప్రదేశానికి వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తన పథకాన్ని అమలు చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. రెచ్చగొట్టి రచ్చ చేసి రాజకీయంగా లబ్ది పొందాలని అంబటి రాంబాబు స్కెచ్ వేశారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే అంబటిని వాహనాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డగించినప్పుడు సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టారని చర్చ జరుగుతున్నది.

OTT Movies : వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. ఆ రెండే మస్త్ ఇంట్రెస్ట్..

Advertisement

అలా చేయడం వల తెలుగుతమ్ముళ్లు ఎలాగు రచ్చ చేస్తారని.. ఆ తర్వాత దీనిని చూపించి రాష్ట్ర పోలీసులు యంత్రాంగం మొత్తం ప్రభుత్వానికి ఎలా కొమ్ముకాస్తున్నారో చూపించి, టీడీపీ గుండాల అరాచకం అంటూ ప్రచారం చేసి లబ్ది పొందాలని అంబటి ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది.అసలు ఇంతగా చేయడానికి కారణం ఏమై ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈనెల రెండో వారంలో ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ అంశాన్ని అడ్డంపెట్టుకుని బడ్జెట్ సమావేశాలను సజావుగా జరగకుండా చేసి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మీద నెగెటివ్ అభిప్రాయాన్ని తీసుకురావాలని, వచ్చే ఎన్నికల్లోగా కూటమిని రెండు ముక్కలు చేసి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి, తమ హయాంలోనే లా అండ్ ఆర్డర్ సజావుగా ఉందని నమ్మించడానికే వైసీపీ ఇంతటి కుట్రకు తెరలేపిందని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×