E-Paper
Advertisement

Ysrcp : ఎలక్షన్ హీట్!.. వైసీపీ గ్రౌండ్ లీడర్స్ సిద్ధమేనా?

Ysrcp : ఎలక్షన్ హీట్!.. వైసీపీ గ్రౌండ్ లీడర్స్ సిద్ధమేనా?
Advertisement

ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎన్నికల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వారంతా ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండటం వారికి కాస్త ఇబ్బందిగా మారనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్లు సైతం ఎవ్వరి మాట వినలేదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వారు ఆడిందే ఆట… పాడిందే పాటగా నడిచింది. ప్రస్తుతం సర్కారు మారడంతో గతంలో రెచ్చిపోయిన వారిమీద ప్రస్తుతం కూటమి నేతలు దృష్టి సారించారు.నాడు ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడ్డారో పోలీసు కేసుల ఆధారంగా ఈసారి వారిని కట్టడి చేయాలని కూటమి నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

పట్టణ, నగరపాలికలే ముందు..

గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగర, పట్టణ ప్రాంతాల్లో కూటమి సర్కారుకు ప్రజాదారణ బాగుందని తెలుస్తోంది. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్,కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కూటమి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు అధికారులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల రెండో వారంలో ఈ ప్రక్రియను ముగించి సెప్టెంబర్‌లో స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కారు అనుకుంటోంది.అందుకే కేడర్‌కు ఇప్పటికే సంకేతాలు పంపించినట్టు సమాచారం. ఇకపోతే ఈ ఎన్నికలు వైసీపీకి కలిసి వస్తాయా? రావా? అనేది తెలియాల్సి ఉన్నది. ఇప్పటికే ఏపీలో కొన్ని స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ముగిశాయి. మరికొన్ని సెప్టెంబర్ నెలలో ముగియనున్నాయి.

కూటమి నేతలను ఎదుర్కొనగలరా?

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్థికంగా, ప్రజల మద్దతు కలిగి బలంగా ఉన్న కూటమి నేతలను వైసీపీ ఢీ కొడుతుందా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో తప్పక గెలుస్తామనే ధీమాతో వైసీపీ నేతలు భారీగా ఖర్చు చేశారు. బడానేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పెద్దమొత్తంలో ఖర్చు చేయగా.. తీరా చూస్తే వైసీపీ చిత్తుగా ఓటమి పాలైంది. ఇప్పుడు కూటమి నేతలు సర్కారు అండతో బలం పుంజుకున్నారు. అధికారంలో ఉన్న వారికే వ్యవస్థ మద్దతుగా నిలుస్తుంది.అందుకే వైసీపీ నేతలు కొందరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఓ కారణమని సమాచారం. ఎందుకంటే గత వైసీపీ హయాంలో చాలా మందికి బిల్లులు రాలేదు. కూటమి సర్కార్ హయాంలోనూ వారికి నిధులు విడుదల కాలేదు. అందుకే వారు పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది.

PM ModI: కొత్త చరిత్రకు రెడీ.. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది.. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

Advertisement

మరికొందరు వైసీపీ నేతలు కేసుల భయంతో బయటకు కూడా రావడం లేదని తెలుస్తోంది. ఇంకొందరు డేర్ చేసి బయటకు వచ్చినా సర్కారుకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయకుండా మౌనంగా ఉండిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలంగా ఉన్నా తీరా ఎన్నికల సమయానికి ఎవరు ఎటువైపు మద్దతిస్తారో తెలియడం లేదు. ఇప్పటికే కొందరు బిల్లుల కోసం, కేసులకు భయపడి కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో సత్తాచాటాలని వారు కసిగా ఉన్న పరిస్థితులు ఏం డిమాండ్ చేస్తాయోనన్న భయం వారిని వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×