E-Paper
Advertisement

Andhra Pradesh Politics: టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు.. చంద్రబాబు తీరుపై భూమన కరుణాకర రెడ్డి ఫైర్!

Andhra Pradesh Politics: టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు.. చంద్రబాబు తీరుపై భూమన కరుణాకర రెడ్డి ఫైర్!
Advertisement

Andhra Pradesh Politics:  కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను మంటగలిపి, అసభ్య చేష్టలతో పట్టుబడిన బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై, చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.

గుంటనక్కలా నక్కిన చైర్మన్  భ్రష్టు పట్టిన పాలకమండలి

టీటీడీ పాలకమండలి చరిత్రలో అత్యంత అధర్మపరుడు, కాముకుడు, స్త్రీ లోలుడైన బీఆర్ నాయుడుని చైర్మన్‌గా నియమించడం ద్వారా చంద్రబాబు శ్రీనివాస సన్నిధికే మచ్చ తెచ్చారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ అధ్యక్షుడిగా నియమించకండి. నేను పాలకమండలి అధ్యక్షుడు అవుతానని విర్రవీగుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని నియమిస్తే పాపం చుట్టుకుంటుందని.. తన ఆవేదనను ఆర్తితో తెలియజేసిన మహిళ ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. ఇలాంటి వ్యక్తిని నియమించవద్దని ఆర్తనాదాలు చేస్తున్నా, చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆ పాపపంకిలమైన చంద్రబాబునే శుద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

పుష్కరిణిలో పుష్కర కాలం మునిగినా చంద్రబాబు చేసిన ఈ పాపం పోదు. సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏడుకొండల మీద ప్రతి రాయిని కడిగినా ఈ అపవిత్రతకు పరిహారం లభించదు. నిన్న తిరుమలలో చంద్రబాబు పర్యటన చూస్తుంటే బీఆర్ నాయుడు ఒక గుంటనక్కలా, కలుగులో ఎలుకలా నక్కి నక్కి తిరిగాడు. జనం ముందుకు రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే బిడియం అన్నట్లుగా ఆయన పరిస్థితి తయారైంది. మహాద్వారం వద్ద ముఖ్యమంత్రికి ప్రసాదం ఇచ్చే కనీస గౌరవం కూడా చైర్మన్‌కు దక్కలేదు. అంటే పదవి కోసం ఎంత అవమానం జరిగినా భరించే నీచ స్థితికి ఆయన దిగజారిపోయారు. చంద్రబాబు కూడా తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినకుండా బీఆర్ నాయుడుని దూరంగా పెట్టినట్లు నటిస్తున్నారు తప్ప, స్వామివారి ప్రతిష్టను మాత్రం గాలికొదిలేశారు.

Also ReadCongress : కేబినెట్ మంత్రులకు కొత్త టెన్షన్?

సమన్వయ లోపం అధికారుల ఆదరణ లేని చైర్మన్

Advertisement

టీటీడీ పరిపాలన ప్రస్తుతం పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. పాలకమండలికి, అధికార వర్గానికి మధ్య అగాధం ఏర్పడింది. బీఆర్ నాయుడు ఎంత నీతిమాలిన పనులు చేసినా చంద్రబాబు పట్టించుకోడు కాబట్టి, ఆయన్ని ఇకపై టీటీడీ అటెండర్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికారులకు అర్థమైంది. మగువల మధ్య మగతనం లేని మనిషి ఉన్నట్లే.. ఇప్పుడు అధికారుల మధ్య బీఆర్ నాయుడు పరిస్థితి తయారైంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారి వెనుక కూడా ఈ భ్రష్టాచారిని తిప్పడం అత్యంత ఆక్షేపణీయం. ఏప్రిల్ 5వ తేదీన జరగనున్న జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో బీఆర్ నాయుడు కుమారుడు పోటీ చేస్తున్నాడు. కేవలం ఆ ఎన్నికల కోసమే, సొసైటీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తన అధికారంతో విఐపీ దర్శనాలు చేయిస్తూ బీఆర్ నాయుడు పదవిని పట్టుకుని వేలాడుతున్నాడు. టీటీడీ చరిత్రలో ఇంతలా అవమానింపబడ్డ మరియు ఇంతలా అసభ్య చేష్టలతో పట్టుబడ్డ తొలి, చివరి చైర్మన్ బీఆర్ నాయుడే.”

రాజీనామా చేసే వరకూ పోరాటం

నిన్న చంద్రబాబు ప్రారంభించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) టెక్నాలజీ ల్యాబ్ పనులకు మా హయాంలోనే శ్రీకారం చుట్టాం. నేను చైర్మన్‌గా, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆధునీకరణకు ఒప్పందం చేసుకున్నాం.కమలవర్ధనరావు ఎఫ్ ఎస్ ఏ ఐ అధికారిని పిలిపించి లేబ్ లు ఆధునికీకరణ కోసం ఒప్పందం చేసుకున్నాం.వైయస్ జగన్ గారు దీనికి పునాది వేస్తే, ఇప్పుడు తామే చేశామని చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. ఈ ల్యాబ్ కోసం శ్రమించిన అధికారిని బదిలీ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ నేపధ్యంలో అప్రాచ్య చేష్టలు చేసిన బీఆర్ నాయుడుని వెంటనే పదవి నుండి తొలగించాలి. హిందూ సమాజం మనోభావాలు దెబ్బతీసినందుకు చంద్రబాబు స్వామివారికి క్షమాపణ చెప్పాలి.

చంద్రబాబు తీరు మింగలేక కక్కలేక అన్నట్లు

జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల కోసం వాడుకుంటున్న విఐపీ దర్శనాల కోటాపై విచారణ జరపాలని భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో.. చంద్రబాబు తీరు మింగలేక కక్కలేక అన్నట్లు ఉంటే.. బీఆర్ నాయుడు పరిస్థితి ఉండలేను, వెళ్లలేను అన్నట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు, బీ ఆర్ నాయుడూ ఇద్దరూ స్వామి ద్రోహులే, హైందవ ద్రోహులనని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో బీ ఆర్ నాయుడుని పాలకమండలి చైర్మన్ గా కొనసాగించడం హేయం. అలాంటి నికృష్ట అప్రాచ్య చేష్టలు చేసిన వ్యక్తిని ఉపేక్షించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు వైయస్సార్సీపి పోరాటం ఆగదు” అని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.

Also Read: AP Politics: పవన్‌ను కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఈ భేటీ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×