E-Paper
Advertisement

Ambati Rambabu: రెడ్ బుక్, పిచ్చి బుక్ ను నా కుక్క కూడా లెక్క చేయదు: అంబటి రాంబాబు

Ambati Rambabu: రెడ్ బుక్, పిచ్చి బుక్ ను నా కుక్క కూడా లెక్క చేయదు: అంబటి రాంబాబు
Advertisement

Ambati Rambabu: రెడ్ బుక్ ను నా కుక్క కూడా లెక్క చేయదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. రెడ్ బుక్ లో అంబటి రాంబాబు పేరుందో, లేదో… అది రాసిన వాళ్లను అడగాలన్నారు. రెడ్ బుక్ అంబటి రాంబాబు, ఇంకా పేర్లు ఉన్నాయంటున్నారని.. మేం ఎవరికీ భయపడమన్నారు.

“రెడ్ బుక్ ను నా కుక్క కూడా లెక్క చేయదు. మేం దేనికీ భయపడం. రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్లం. జగన్ కష్టాల్లో ఉంటే ఆయన వెంట ఉన్నవాళ్లం. దేనినైనా ఎదురించి నిలబడిన వాళ్లం. మీ రెడ్ బుక్ లకు, మీ పిచ్చి బుక్ లకు భయపడే పిరికిపందలం కాదు. లోకేశ్ కు రాజకీయ అనుభవం లేదు. సీఎం కొడుకు కాబట్టి చక్రం తిప్పుతున్నారు. అతడే టీడీపీ పతనానికి నాంది కాబోతున్నారు” – అంబటి రాంబాబు

తిరుమల లడ్డూ కల్తీ అవాస్తవం

Advertisement

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తమని అంబటి రాంబాబు అన్నారు. లడ్డూలో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.. జగన్ పై బురదజల్లారు. కూటమి ప్రభుత్వం నియమించిన.. ఈవో లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పారన్నారు. కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించామన్నా్రు. కల్తీ అంటే వనస్పతి లాంటి నూనెలు కలిపారని రిపోర్టు వస్తే.. ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించామని టీటీడీ ఈవోనే స్వయంగా చెప్పారన్నారు. కల్తీ అని అనుమానం ఉంటే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపుతారన్నారు. చంద్రబాబు, జగన్, రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారని చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి అడ్డంపెట్టుకుని రాజకీయం చేసిన వాళ్లను ఆ భగవంతుడు క్షమించడన్నారు.

Also Read: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలనం.. లంచం తీసుకున్నట్టు అంగీకరించిన టీటీడీ మాజీ అధికారి

ఎన్టీఆర్ విగ్రహానికి డబ్బులెక్కడివి

Advertisement

“ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. ఆరోగ్య శ్రీకి డబ్బులు లేవంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అర్హత లేని వ్యక్తి నారా చంద్రబాబు. ఒకవేళ పెట్టినా విగ్రహాన్ని వంచి వెనక కత్తితో వెన్నుపోటు పొడుస్తున్న చెయ్యి కూడా పెట్టాలి. ప్రభుత్వ సొమ్ముతో విగ్రహం పెడతామంటే ముందు జనసేన వాళ్లే ఒప్పుకోరు” – అంబటి రాంబాబు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×