E-Paper
Advertisement

Ambati Rambabu: అంబటికి ఎన్నేళ్లు జైలు శిక్ష విధిస్తారు? సీఎంను దూషిస్తే వేసే శిక్షలేంటీ?

Ambati Rambabu: అంబటికి ఎన్నేళ్లు జైలు శిక్ష విధిస్తారు? సీఎంను దూషిస్తే వేసే శిక్షలేంటీ?
Advertisement

Ambati Rambabu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంబటి రాంబాబుపై నల్లపాడు సహా రాష్ట్ర వ్యాప్తంగా 16 క్రిమినల్ కేసు నమోదు అయ్యాయి. సీఎంపై వ్యక్తి దూషణలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనల్లో నల్లపాడు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. సెక్షన్లు 126(2), 196(1), 352, 351(2), 292r/w 3(5), 132 బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో రెండేళ్ల వరకు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు. అయితే ముఖ్యమంత్రిని అభ్యంతరకరంగా దూషిస్తే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.

ఏ సెక్షన్లు వర్తిస్తాయి?

  1. సోషల్ మీడియాలో / ఫేస్‌బుక్ / ఎక్స్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే → సెక్షన్ 504 + 294 + 505(2) + 153A కింద కేసులు నమోదు చేస్తారు.
    పబ్లిక్‌గా బూతులు తిట్టడం → సెక్షన్ 294 + 504 నమోదు చేస్తారు.
    తీవ్ర వ్యాఖ్యలు, రాజకీయపరంగా అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే → 153A, 505 సెక్షన్లు జోడిస్తారు. అలాగే అరెస్టు చేస్తారు.
  2. సెక్షన్ 504 ఐపీసీ – ఉద్దేశపూర్వకంగా అవమానం చేసి శాంతికి భంగం కలిగించే ప్రయత్నం చేయడం. ఈ కేసులో 2 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా విధిస్తారు. ఇవి కాగ్నిజబుల్, బెయిలబుల్ సెక్షన్లు. ఇది అత్యంత సాధారణంగా వాడే సెక్షన్.
  3. సెక్షన్ 294 ఐపీసీ / బీఎన్ఎస్ – పబ్లిక్ ప్లేస్ లో అసభ్యకర చర్యలు లేదా బూతులు తిట్టడం. 3 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధిస్తారు. ఇది కాగ్నిజబుల్, బెయిలబుల్ సెక్షన్. పబ్లిక్ ప్రదేశాల్లో బూతులు తిడితే ఈ సెక్షన్ ఎక్కువగా వేస్తారు.
  4. 153A ఐపీసీ/ బీఎన్ఎస్ BNS 196 – మతం, జాతి, భాష, ప్రాంతం మీద శత్రుత్వ భావాలు రెచ్చగొడితే ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇది కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ (కొన్ని కేసుల్లో) కేసు. కేసు తీవ్రతను బట్టి ఈ సెక్షన్లు వాడతారు.
  5. సెక్షన్ 505(2) IPC / BNS – గ్రూపుల మధ్య శత్రుత్వం రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం. ఈ కేసులో 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ సెక్షలు. సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలకు ఈ సెక్షన్లు ఎక్కువగా వాడతారు.
  6. సెక్షన్ 500 IPC – డిఫమేషన్ కేసు, ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కంప్లైంట్ చేస్తే ఈ సెక్షన్ విధిస్తారు. 2 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా రెండు విధిస్తారు. ఇది నాన్-కాగ్నిజబుల్, బెయిలబుల్ కేసు. సివిల్ కేసుగా కూడా నమోదు చేస్తారు.

జైలు శిక్ష ఎంత వస్తుంది?

సుప్రీంకోర్టు ఆదేశాలు, గత తీర్పుల ఆధారంగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులకు బెయిల్ మంజూరు చేయవచ్చు. అభ్యంతర వ్యాఖ్యల కేసుల్లో అరెస్టు అయిన తర్వాత బెయిల్ పై బయటకు వస్తారు. ఈ తరహా కేసుల్లో కోర్టు ఎక్కువగా జరిమానా లేదా 3-6 నెలల జైలు విధిస్తుంటుంది. జైలు శిక్ష సస్పెండ్ చేసి రిలీజ్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. 3 సంవత్సరాల వరకు శిక్ష వచ్చే సెక్షన్లు (153A, 505) ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ మందికే పూర్తి జైలు శిక్ష విధించారు.

Advertisement

Also Read:  వ్యాఖ్యల తంటా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు, రెండువారాలు అక్కడే

గత తీర్పులు ఏం చెబుతున్నాయి?

సుప్రీంకోర్టు, హైకోర్టుల గత తీర్పుల ప్రకారం.. కేవలం బూతులు తిట్టడం, అవమానించడం వల్ల రాజద్రోహం(124A) కిందకు రాదు. అలాగే కేవలం అసభ్య భాష వల్ల 294 సెక్షన్ కింద శిక్ష పడదని తీర్పులు ఇచ్చాయి. అందుకే అభ్యంతర వ్యాఖ్యల కేసుల్లో ఎక్కువగా 504 + 153A + 505 సెక్షన్లు పెట్టి అరెస్టు చేస్తున్నారు. కానీ చాలా కేసుల్లో బెయిల్ త్వరగానే వస్తుంది. నిర్దిష్ట కేసులో ఏ సెక్షన్లు అమలు అవుతాయనేది పోలీసులు, ప్రభుత్వం, కంప్లైంట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×