E-Paper
Advertisement

YS Viveka Murder Case Updates: వివేకా హత్య కేసు కదలిక.. పీఏ ఇంటికి పోలీసులు, ఏం జరుగుతోంది?

YS Viveka Murder Case Updates: వివేకా హత్య కేసు కదలిక.. పీఏ ఇంటికి పోలీసులు, ఏం జరుగుతోంది?
Advertisement

YS Viveka Murder Case Updates: వైఎస్ వివేకానంద హత్య కేసు కదలిక మొదలైందా? వివేకా పీఏ నుంచి ఏ విధమైన సమాచారం సేకరించారు? ఈ విషయంలో సమాచారం సేకరించారు? కేసుకు సంబంధించా? లేక గతంలో ఫిర్యాదు చేసిన కేసులకు సంబంధించినవా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

వైఎస్ వివేకా కేసు ఎంత వరకు వచ్చింది. రేపో మాపో సీబీఐ రంగంలోకి దిగుతున్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నమోదైన కేసులపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. ఇందులో భాగంగా సోమవారం ఉదయం వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆయన నుంచి కీలక సమాచారం తీసుకున్నారు.

Advertisement

ఇంతకీ ఏ విషయంలో విచారణ చేపడుతున్నారు పోలీసులు. రెండేళ్ల కిందట వివేకా కూతురు, ఆమె భర్త రాజశేఖర్, అప్పటి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు పీఏ కృష్ణారెడ్డి. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసులు నమోదు అయ్యాయి.

దీనికి సంబంధించి పీఏ కృష్ణారెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన స్టేట్మంట్‌ని రికార్డు చేశారు పోలీసులు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో ఆయన వాంగ్మూలం తీసుకున్నారు.

Advertisement

ALSO READ: దారుణం.. 23 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన కాలేజ్ సిబ్బంది, కారణం తెలిస్తే మండిపడతారు!

ఆనాడు కృష్ణారెడ్డి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు? వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని పులివెందుల న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అప్పటి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారన్నది ఆయన మాట. ముఖ్యంగా సీబీఐ అధికారులు ఏం చెబితే అదే చెయ్యాలని తనను బెదిరించారని అందులో ప్రస్తావించారాయన.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×