// // YS Sharmila Speech : ఢిల్లీలో వైఎస్ షర్మిల గళం.. ఏపీ విభజన హామీలపై పోరాటం.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

YS Sharmila Speech : ఢిల్లీలో వైఎస్ షర్మిల గళం.. ఏపీ విభజన హామీలపై పోరాటం..

YS Sharmila Speech : ఢిల్లీలో వైఎస్ షర్మిల గళం.. ఏపీ విభజన హామీలపై పోరాటం..
Advertisement

YS Sharmila Speech : ఏపీ హక్కులపై ఢిల్లీ వేదికగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. కేంద్రంపై గళమెత్తారు.విభజన చట్టంలో హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి 10 ఏళ్లు కొనసాగిస్తామని గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు. తిరుపతి సభలో ప్రధాని మోదీ ప్రత్యేక హోదా గురించి ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని వైఎస్ షర్మిల అన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ తీసుకువస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారన్నారు. ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisement

ఇండస్ట్రియల్ కారిడార్లు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా ఇంకా ఎన్నో హామీలు విభజన చట్టంలో ఉన్నాయన్నారు షర్మిల. ఎన్నికల ప్రచారం సమయంలో మోదీ ఏపీలో పర్యటిస్తూ ఎన్నో హామీలు ఇచ్చారని.. అవన్నీ ఏమయ్యాయి? చట్ట సభలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఏమైంది? ప్రశ్నించారు. హైదరాబాద్ ను పదేళ్లు కామన్ క్యాపిటల్ గా ఉంచుతూ కొత్త రాజధాని నిర్మిస్తామన్నారు. పదేళ్లు గడిచాయి. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ లేకపోయింది. సొంత రాజధాని నగరం నిర్మాణం కాలేదని షర్మిల మండిపడ్డారు.

కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం.. వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కాలేదని షర్మిల విమర్శించారు. ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ గెలవలేదని.. అయినా సరే రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్రంలో పార్టీలన్నీ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనలో సీతారాం ఏచూరి సహా పలువురు నేతలను షర్మిల కలిశారు. ఏపీ విభజన హామీలను వారికి వివరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×